Tuesday, November 27, 2012

ఐశ్వర్యారాయ్ కి ఫ్రెంచ్ ప్రభుత్వ "నైట్ ఆఫ్ ద ఆర్డర్" అనే అత్యున్నత పురస్కారాం....ఫోటోలు

ఐశ్వర్యరాయ్ ని ఆమె అభిమానులంతా సౌందర్య సంపదగా చెప్పుకుంటారు. అలాంటి ఐశ్వర్యరాయ్ కి ఫ్రెంచ్ ప్రభుత్వం 'నైట్ ఆఫ్ ద ఆర్డర్' అనే అత్యున్నత పురస్కారాన్ని అందజేసి, ఆమెకు మరింత గౌరవాన్ని కల్పించింది. ఐశ్వర్యరాయ్ పుట్టినరోజు సందర్భంగా ఫ్రాన్స్ రాయబారి ఫ్రాంకోయిస్ రిచీయర్ ఆమెకి ఈ పురస్కారాన్ని అందజేశారు. కళారంగానికి ఐశ్వర్య అందించిన సేవలకు గుర్తుగా ఆమెకి ఈ పురస్కారాన్ని అందజేసినట్టుగా ఆయన చెప్పారు.

తాను ఈ స్థాయికి చేరుకోవడానికీ ... ఇలాంటి అరుదైన పురస్కారాలను అందుకోవడానికి కారణం తన కుటుంబ సభ్యులేనని ఐశ్వర్య అన్నారు. తనని ప్రోత్సహిస్తోన్న తన కుటుంబ సభ్యులకు తాను ఎంతగానో రుణపడి ఉన్నానని అంటూనే, తనకి ఈ పురస్కారాన్ని అందించిన ఫ్రెంచ్ ప్రభుత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. పలువురు ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమానికి ముంబై లోని రిట్జ్ హోటల్ వేదిక అయింది. గతంలో ఈ పురస్కారాన్ని బాలీవుడ్ ప్రముఖులు షారూఖ్ ఖాన్ ... నందితాదాస్ అందుకున్నారు.


No comments:

Post a Comment