Wednesday, November 28, 2012

"బ్లాక్ ఫ్రైడే" రోజున అమెరికన్ల షాపింగ్ క్రేజ్...ఫోటోలు

నవంబరు 23 తేదీని ‘బ్లాక్ ఫ్రైడే’ . ‘ధ్యాంక్స్ గివింగ్ డే’ తర్వాత వచ్చే ‘బ్లాక్ ఫ్రైడే’ రోజునుండి అమెరికాలో అమ్మకాల జోరు పుంజుకుంటుంది. ఆ రోజునుండే క్రిస్టమస్ షాపింగ్ సీజన్ మొదలవుతుంది. ఆ రోజున తెల్లవారు ఝామునే షాపులు తెరిచి అమెరికన్ల పండగ సంతోషాన్ని సొమ్ము చేసుకోవడానికి వ్యాపారులు ప్రయత్నిస్తారు. బ్లాక్ ఫ్రైడే రోజే సంవత్సరం మొత్తంలో అత్యంత బిజీ డే. కఃస్టమర్ల కోసం ఉదయం 4 గంటలకే షాపులు తెరిచి ఉంచేరు.

వ్యాపార సంస్థలన్నీ, వారం-పది రోజుల ముందునుంచే వినియోగదారులను ఆకట్టుకునేందుకు తగ్గింపు ధరల ప్రకటనలను పత్రికల్లో గుప్పిస్తారు. వార్తాపత్రికలను చదవడం మాటేమోకాని, వాటిల్లో వచ్చే "డిస్కౌంట్ కూపన్ల"ను మాత్రం వదలకుండా భద్రపరుచుకుంటారందరు. "సేల్స్" అన్న పదం ఆ వారం-పది రోజులు ప్రతి ఇంట్లోనూ ఉపయోగించే ఒక ఊత పదం అనొచ్చు. ఆదాయ వ్యత్యాసాలకు అతీతంగా కూపన్లను సేకరిస్తుంటారు ప్రతిఒక్కరు. చేతుల్లో కూపన్లనుంచుకొని, దుకాణాల ముందర ధనిక-బీద-మధ్యతరగతి అన్న తారతమ్యం లేకుండా, అమెరికన్లు-అమెరికనేతరులు, ఒకరిపై ఇంకొకరు పోటీపడి, ఎంత ముందు వీలవుతే అంత ముందు గంటల తరబడి కాచుకుని నిలబడతారు. మాల్స్ లో ముందుగా అడుగుపెట్టినవారికి కొన్ని పూర్తి ఉచితంగా, ఆ తర్వాత అడుగుపెట్టినవారికి ఎక్కువ డిస్కౌంట్స్ ఇస్తాయి కొన్ని వ్యాపార సంస్థలు. ఏ అవకాశమూ వదులుకోకుండా పూర్తిగా సద్వినియోగం చేసుకునే ఆలోచనతోనే వుంటారందరు.


No comments:

Post a Comment