Monday, November 5, 2012

పోర్టబుల్ (మొబైల్) పవన విద్యుత్ పరికరం...గొప్ప ఆలొచన.....ఫోటోలు మరియూ వీడియో

పవన విద్యుత్తు అనగా గాలిని ప్రత్యేక యంత్రాలను ఉపయోగించి విద్యుచ్ఛక్తిగా మార్చడం. 2007 నాటికి ప్రపంచం మొత్తమ్మీద సుమారు 94.1 గిగావాట్ల విద్యుచ్చక్తి ఉత్పత్తి అవుతున్నదని అంచనా వేసేరు. ప్రస్తుతానికి ప్రపంచం వినియోగించే మొత్తం విద్యుత్తులో పవన విద్యుత్తు వినియోగం కేవలం 1 శాతమే అయినా, 2000 నుంచీ 2007 వరకు ఐదురెట్ల వేగంతో అభివృద్ధి చెందుతూ వస్తోంది. చాలా దేశాలలో ఇది చెప్పుకోదగ్గ స్థాయిలో వాడుకలో ఉంది. డెన్మార్క్ లో 19%, స్పెయిన్, పోర్చుగల్ లో 9%, జర్మనీ, ఐర్లాండ్ లలో 6% విద్యుదుత్పత్తి పవనశక్తినుంచే ఉత్పత్తి అవుతున్నది.

పవన శక్తిని మన పూర్వీకులు, చాలా ఏళ్ళ ముందునుంచీ నావలను నడపడానికీ, నీటిని తోడటానికి, గింజలను పొడి చేయడానికి వాడేవారు. కానీ ప్రస్తుతం దీని ఉపయోగం ఎక్కువగా విద్యుదుత్పత్తిలోనే. పవన విద్యుత్తు శిలాజ ఇంధనాల వంటి ఇతర వనరుల నుంచి ఉత్పత్తి చేసే విద్యుత్తుతో పోలిస్తే తక్కువ గ్రీన్హౌస్ వాయువులను విడుదల చేస్తుంది కాబట్టి, పర్యావరణ కారులు దీన్ని మంచి ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా భావిస్తున్నారు.

మానవుడు కనీసం 5,500 సంవత్సరాలకు పూర్వమే పవన శక్తిని తెరచాపల రూపంలో నౌకలను నడపడానికి ఉపయోగించడం నేర్చుకున్నాడు. బాబిలోనియన్ చక్రవర్తియైన హమ్మురాబి 17వ శతాబ్దంలో తాను తలపెట్టిన మహత్తర సాగునీటి పథకం కోసం పవన శక్తిని ఉపయోగించాలనుకున్నాడు


ఇంతకు ముందు చిన్న చిన్న పరికారాలకు పవన విద్యుత్ ను ఉపయోగించుకోవడానికి పరికరాలు ఉత్పత్తిచేసేరు

ఇప్పుడు అప్రైస్ ఎనర్జీ అనే కంపెనీ ఇళ్ళకు కావలసిన పవన విద్యుత్ పరికరాన్ని తయారుచేస్తున్నారు

No comments:

Post a Comment