Tuesday, November 20, 2012

మనగురించే మనకే తెలియని విషయాలు....ఫోటోలు

మీరు అనుకున్నదానికంటే మీ పొట్ట చురుకైనది
మన పొట్టలో ఉండే న్యూరాన్లు జంతువుల మెదడులో ఉండే న్యూరాన్లకంటే ఎక్కువ. అందుకే కొంతమంది పొట్టను రెండవ మెదడు అంటారు.మన శరీరంలోని మిగతా పార్ట్ లలో కూడా...ఊదాహరణకు: చేతులలో కూడా ఎక్కువ న్యూరాన్లు ఉన్నప్పటికీ పొట్టలోని న్యూరాన్లు తమకుతాముగా ఆలోచించుకోగలవు. దీని అర్ధం ఏమిటంటే ఇది తింటే మనకి అరుగుతుందా? లేదా? అని మీరు ఆలొచించనవసరంలేదు. మీకెప్పుడైనా అర్ధంలేకుండా దృఢముగా లేనట్లుగానీ, చిరాకుగా గానీ, త్రుప్తిగా గాని ఉందనిపిస్తొందా. బ్రహ్మాండమైన భోజనం చేసినప్పుడు దేనిమీదా ఏకాగ్రతవహించలేకపోతున్నారా. దీనికి మీ పొట్టకూడా ఒక కారణమైనా …వివేకంగా తినడం మంచిది.

చింపాంజీ లాగానే మనకూ ఎక్కువ రోమాలు
పై ఫోటో చూస్తే మీకు నమ్మబుద్ది కాదు(hypertrichosis అనే వ్యాధితో ఉన్న వారు అలా ఉంటారు). కానీ వానరులకు లాగానే మనకి కూడా రోమాలు ఎక్కువే. కానీ మనపై ఉన్న రోమాలు అతి సన్నగానూ, అతి పొట్టిగానూ ఉంటాయి. మన శరీరంలోని ప్రతి ఇంచ్ కీ 500-1000 లోపు రోమ చిప్పలు ఉన్నాయి.

మనమే ఒక ఆశ్చర్యం
గర్భంలో మొదట మన ఆకారం సమవిభక్తాంగముగా (వొకటికోకటి పొంకముగా వుండే)ఉంటుంది. కానీ అది వారములు గడిచే కొద్ది కొద్దికొద్దిగా కళ్ళు, చెవులూ,ముక్కూ ఇలా ఆకారలుగా మారి చివరకు బిడ్డగా రూపం పొందుతుంది.

మనం కొంత వైరస్
Human Genome Project వారు మన DNA ను పరిశోధించినప్పుడు వారు ఆశ్చర్య పోయేరు. వైరస్ లు తమకు తామే పునరుత్పాదనము చేసుకోలేవు. కొన్ని వైరస్ లు తమ DNA లను అతిధి గుడ్డులోగానీ బీజకణంలో గానీ ప్రవేశించాలి. అప్పుడు ఆ వైరుస్ పునరుత్పాదనము చెందుతాయి. మానవ పరిణామ క్రమంలో 9 % జన్యువు వైరస్ ల నుండే తీసుకోబడినదట.

మనకు మనంగా చెక్కిలిగింతలు పెట్టుకోలేము
మానవ బంధము, ముఖ్యంగా తల్లితండ్రులకూ పిల్లలకూ మధ్య చెక్కిలిగింతలు వలనేనట. మనం పెద్దైన తరువాత మనకి ఎవరైన చెక్కిలిగింతలు పెడితే మనకి నచ్చదు. నవ్వురాదు. ఎందుకంటే మన మెదడుకు తెలుసు మనం క్రుతిమంగా చేసుకుంటున్నామని.

మీ శరీరం మీకంటే చిన్నది
ఈ విషయంలో శాస్త్రవేత్తల వివాదం ఇంకా జరుగుతునే ఉన్నది. కాని ఇది నిజమట. మనకు వయసుపెరిగినా మన అవయవాలు మన చిన్న వయసులో ఉన్నట్లే ఉంటాయట.

మనం కొంతమటుకు గుడ్డివారిమే
దురద్రుష్టవసాత్తూ రూపకల్పనలోనే మన కళ్లలో దోషం ఉన్నదట. రెండు కళ్ళలోనూ ఒక బ్లైండ్ స్పాట్ ఉన్నది. ఒక కన్ను తెలియనివారికి రెండొ కంటిలో ఉన్న బ్లైండ్ స్పాట్ వలన ఇబ్బంది కలుగుతుంది. రెండు కళ్ళూ బాగున్న వారిలో ఇబ్బందులు అసలు తెలియదు.

మనకు మనమే స్వేచ్చగా ఆదేశించుకోలేము
ఈ విషయములో కూడా శాస్త్రవేత్తల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మన ఆదేశాలకు ముందే మన మెదడు తన పనులను మనచేత చేయిస్తుందట.

మన శరీరం మీద గీతలు ఉంటాయి
సస్తనజాతి జంతువులకు (పిల్లలకు పాలిచ్చే జంతువులు) గీతలుంటాయి. అవి కనబడతాయి. మానవ శరీరంలో కూడా ఇలా గీతలు ఉంటాయి. కానీ అవి కనబడవు. ఈ గీతలను Blaschko’s Lines అంటారు.

No comments:

Post a Comment