Saturday, November 17, 2012

మనుష్యుల వింత పెళ్ళిల్లు....ఫోటోలు

ఆవుతో పెళ్ళి
ఇది కావాలనో, కోరుకునో చేసుకున్న పెళ్ళి కాదు. బాలి నగరంలో ఒక 18 సంవత్సరాల యువకుడు అతనున్న పక్కింట్లోని ఆవును ప్రతిరోజూ చూడటానికి వెళ్ళేవాడు. ఇది తెలుసుకున్న పక్కింటి వాళ్ళు కారణమేమిటని అడిగేరు. ఈ ఆవు నాకు ఒక అందమైన అమ్మాయిగా కనబడుతోందని పరిహాసంగా చెప్పేడు. ఆ పరిహాసమే అతనిమీద నేరంగా మారింది. అక్కడున్న పెద్దలు అతన్ని శిక్షించ నిర్ణయించి ఆ ఆవునే అతడు పెళ్ళిచేసుకోవాలని తీర్పునిచ్చేరు. ఆలా ఆ యువకుడు ఆ ఆవును పెళ్ళిచేసుకున్నాడు.

మేకతో పెళ్ళి
ఇది కూడా పైన చెప్పినదానికి లాగే శిక్చా వివాహం. 2006 లో సుడాన్ లోని ఒక గ్రామంలో జరిగింది. ఐయితే ఇక్కడి పెద్దలు పెళ్ళిని ఒక ఎకసక్కెం క్రింద తీసుకుని, పెళ్ళిజరిపించి మేక యజమానికి కట్నం ఇప్పించి యువకుడిని విడిచిపెట్టేరు.

ఈఫిల్ టవర్తో పెళ్ళి
Erika Eiffel, née LaBrie అనే ఈమె ఈఫిల్ టవర్ తో ప్రేమలో పడింది. 3 సంవత్సరాల ప్రేమ తరువాత 2007 లో ఒక రోజు ఈఫిల్ టవర్ ను పెళ్ళాడి ఖ్యాతి తెచ్చుకుంది. ఇప్పటికీ అమే మరెవరినీ పెళ్ళి చేసుకోకుండా ఈఫిల్ టవర్నే భర్తగా చూసుకుంటోంది.

కుక్కతో పెళ్ళి
ఆస్త్రేలియాకు చెందిన Joseph Guiso తాను పెంచుకున్న కుక్కతొ ప్రేమలో పడ్డాడు. అంతే తనవారందరినీ పిలిచి ఒక శుభ ముహూర్తాన ఆ కుక్కను పెళ్ళిచేసుకున్నాడు.

సరకులబండి(లారీ)తో పెళ్ళి
కాలిఫోర్నియాకుచెందిన Maria Griffin అనే ఈమె ఒక లారీతో ప్రేమలో పడింది. అంతే ఆ లారీనేఅ వివాహమాడింది. ఆ లారీతో అమె హనీమూన్ కు కూడా వెళ్ళిందట.

బెర్లిన్ గోడతో పెళ్ళి
Eija-Riitta Berliner-Mauer అనే పెరున్న ఈమె తన చిన్న వయసులోనే బెర్లిన్ గోడతో ప్రేమలో పడిందట. 1979లో ఆ గోడను పెళ్ళిచేసుకుంది. 1989 లో ఆ గోడను పగులకొట్టినప్పుడు అమె భర్త పోయేడని ఏడ్చిందట.

పిల్లితో పెళ్ళి
జెర్మనీకి చెందిన Uwe Mitzscherlich అనే అతను 15 సంవత్సరాలుగా ఒక పిల్లిని పెంచుతున్నాడు. ఆ పిల్లికి హెల్త్ బాగుండకపోతే హాస్పిటల్ కు తీసుకు వెళ్లేడు. అక్కడి డాక్టర్లు పిల్లి ఎక్కువ కాలం బ్రతకదని తెలిపేరు. అంతే. వెంటనే ఆ పిల్లిని పెళ్ళాడేడు.

దిండుతో పెళ్ళి
Lee Jin-gyu అనే అతను తనకు నిద్ర పోతున్నప్పుడు ఆ దిండు అతనికి ఎన్నొ అందమైన కలలను రప్పించి, ఎంతో శుఖ నిద్రలో ఉంచేదట. అందుకని అతను 2008 లో అందరినీ పిలిచి ఆ దిండును పెళ్ళిచేసుకున్నాడు.

డాల్ఫిన్ తో పెళ్ళి
Sharon Tendler అనే ఇజ్రేల్ కు చెందిన ఈమే చాండీ అనే డాల్ఫిన్ తో ప్రేమలో పడి దానినే పెళ్ళిచేసుకుంది.

చనిపోయిన ప్రేమికురాలితో పెళ్ళి
పైన చెప్పబడిన విభ్రాంతి కలిగించే పెళ్ళిల్ల కంటే ఇది ఎంతో గొప్పదనిచెప్పవచ్చు. 2012 జనవరిలో సరన్యా అనే తన ప్రేమికురాలు ఒక కారు ప్రమాదంలో చనిపోతే, తాయ్లాండ్ కు చెందిన Chadil Deffy అనే ఇతను చనిపోయి శవం గా ఉన్న ఆమెను పెళ్ళాడేడు. ఇది ఒక విధంగా దుఃఖకరమైనది.

1 comment:

  1. పెళ్ళి సంగతి సరే ... మరి కాపురాలు సంగతో ... వాటితోనే చేస్తారా ? ... ఆ మధ్య Gay అనే బేచ్ మొదలయ్యింది... మళ్ళీ కొత్తగా ఇదో రకం బేచ్చా

    ReplyDelete