Wednesday, November 14, 2012

స్తంభింపజేయు ఈ భవిష్యత్ సంభవములను చూడాలనుంది...ఫోటోలు

భవిష్యత్తు లో జరగబోయే విషయాలగురించి మానవులు ఎప్పుడూ ఎదురుచూస్తూవుంటారు. అది జ్యోతిశ్శాస్త్ర సంబంధమైనది కానివ్వండి లేక తమ కల్పన వలన కానివ్వండి మానవులు భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి తెలుసుకోవటానికి ప్రయత్నిస్తారు. ఈ క్రింద వివరించబడినవి శాస్త్రసమ్మతమైన ప్రపంచవ్యాప్త పరిశోధనల సూచన. ఇందులో కొన్ని ఉత్త మూఢవిశ్వాసము లో కాకుండా ప్రణాళికా దశలో ఉన్నాయి.

Cheap Green Energy...2016....ఇది ఇప్పటికే అందరికీ తెలిసినదైనా 2016 కు ఇందు నుండి తీసే కరెంటు ప్రజల కష్టాలను కొంతవరకు తీరుస్తుంది. 2020 లో దీని వలన ప్రజలు పొందే లాభం ప్రజలకు ఆనందం కలిగిస్తుంది. ఎందుకంటే అప్పటికి ఆయిల్ అతి ఖరీదైనదిగా ఉంటుందికాబట్టి, పవన విద్యుత్త్ చవుకగా దొరుకుతుంది.

Helium-3 Mining....2020....2020 లో రష్యా చంద్ర గ్రహం నుండి హీలియం-3 ని భూమికి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తోంది. న్యూక్లియర్ కి బదులు హీలియం-3 కెమికల్ ను ఉపయోగించి కరెంట్ తయారుచేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కరెంట్ వలన పర్యావరణ కాలుష్యం లేని కరెంట్ దొరకడమే కాకుండా అతి తక్కువ ఖరీదుతో ప్రపంచవ్యాప్తంగా కరెంటును సరఫరా చేయగలుగుతుంది. దీనికోసం యూరోపియన్ యూనియన్లతో కలిసి కర్మాగార యంత్రాగార నిర్వహణలో ఉన్నది.

Martian Settlement...2023....డచ్చ్ ప్రబుత్వం 2023 లో మానవులను అంగారక గ్రహానికి తీసుకువెళ్ళే ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీనికోసం 4 రోదసీయాత్రికులను ఎంపిక చేసింది. వీరు అంగారక గ్రహం పై మనుష్యులు జీవించడానికి ఇళ్ళు అమరుస్తారు. ఆ గ్రహం పై సూర్యరశ్మితో కరెంట్ ఏర్పాట్లు చేస్తారు. 2025 లో మరో 4 రోదసీయాత్రికులను పంపుతారట. ఈ మొత్తం 8 మంది అక్కడే ఉంటారు. ఇక వారి జీవితకాలంలో భూమిని చూడరు. వారు అందించే పరిశోధణా అంచనాలను బట్టి మనుష్యులను భూమి నుండి అక్కడకు పంపడానికి మొదలపెడతారు. అయితే ఆ గ్రహానికి వెళ్ళడానికి ఒక సంవత్సరం ప్రయాణం చేయాలి. ఒక మనిషి వెళ్ళడానికి 1.5 బిల్లియన్ డాలర్లు కర్చు అవుతుంది. మొదటి 8 మందికి కావలసిన డబ్బును సేకరిస్తున్నారు.

Completion of Masdar City...2025....అబు దాబీలో తయారౌతున్న ఈ పట్నం మనుష్యులు క్లీన్ ఎనర్జీ తొ బ్రతకడానికి కావలసిన వసతులు కలిగి ఉంటుంది. 20 బిల్లియన్ డాలర్లతో తాయారౌతున్న ఈ క్లీన్ ఎనర్జీ పట్నం ఎలా ఉంటుందో కొన్ని సంవత్సరాలు వేచి చూసి ఇలాంటి పట్టనాలాను ప్రపంచవ్యాప్తంగా నిర్మిస్తారట.

The First World Resource Crisis...2030.....పెరుగుతున్న జనభా లెక్కలను పరిశోధిస్తే 2030 లో నిత్యావసర వస్తువుల కొరత ఎక్కువగా ఏర్పడి ప్రపంచవ్యాప్తంగా సుమారు 3 బిల్లియన్ ప్రజలు పేదరికానికి గురౌతారు.ఈ లోపు ఏర్పడే ప్రక్రుతి వైపరీత్యాల వలన మరింత నష్టం జరుగుతుంది. దీనిని ప్రపంచం ఏలా ఎదుర్కొంటారో చూడాలి.

Bionic Eyes....2035.....ఈ టెక్నాలజీ ఇప్పటికే ఉన్నది. కానీ 2035 లోపు తయారచేసే ఈ కళ్ళు అల్ట్రా రెడ్ మరియూ అల్ట్రా వయిలెట్ కిరణాలను చూడగలిగేదిగా ఉంటుంది.

Immortality...2036....వైద్య శాస్త్రం ఎంత అభివ్రుద్ది చెందిదో అందరికీ తెలుసు. డి.ఎన్.ఏ పరిశోధనలు మనిషికి ముసలితనం రావడానికి కారణాలను కనుకున్నది. మనిషికి ముసలితనం రాకుండా ఉండటానికి పరిశోధనలు జరుపుతోంది. 2036 లోపు ఇది సాధ్యమౌతుందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.

Quantum Computing at Home...2037.....మొదటి క్వాంటం కంప్యూటర్ మరో 5 నుండి 10 సంవత్సరాలలో తయారైన, ఈ కంప్యూటర్ డెస్క్ టాప్ కంప్యూటర్లలాగా ప్రతి ఇంట్లోనూ 2037లో ఉండటుందని చెబుతున్నారు. దీని వలన ముఖ్యంగా మనిషికి కావలసిన హెల్త్ కేర్ మందులు, వాటి ప్రయోజనాలను నేరుగా రోగి శరీరంలోకి పంపగలుగుతాయి.

Technological Singularity...2045....మనుష్యుల లాంటి మిషెన్లు తయారుచేయబడతాయి. ఇవి మనిషికి తోడుగా ఉంటాయి. అనీ విషయాలలోనూ సహాయం అందిస్తాయి.

1 comment: