Tuesday, November 13, 2012

డెంగు వ్యాధికి హోమియోపతి మందు:… కింగ్ ఇన్స్ టిట్యూట్ వెళ్ళడి...ఫోటోలు

19 వ శతాబ్ధము నుండి అమెరికాలో సాంప్రదాయకంగా జ్వరానికి వాడబడుతున్న అమెరికా దేశానికి చెందిన హోమియోపతి మందు Eupatorium perfoliatum డెంగు వ్యాధి చికిత్స కు బాగా పనిచేస్తోందని తమ పరిశోధణలలో తెలిసిందని కింగ్ ఇన్స్ టిట్యూట్ ,చెన్నై డైరెక్టర్ డాక్టర్ పి.గునసేకరన్ తెలిపేరు. ఈ ఇన్స్ టిట్యూట్ కు చెందిన హోమియోపతిక్ నిపుణులు Eupatorium perfoliatum మందును 50 మంది రోగులకు(డెంగు వ్యాధి రోగులు)ఇచ్చినప్పుడు, వారిలో అందరూ ఆ వ్యాధి నుండి పూర్తిగా కోలుకున్నట్లు తెలిపేరు. డెంగు వ్యాధిలో ముఖ్య అపాయము రోగి రక్తములోని ప్లేట్లెట్లు తగ్గిపోవడమే. అయితే ఈ మందు ఇచ్చినప్పుడు రోగిలోని ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోకుండా కట్టుదిట్టంలో ఉండటం, తగ్గిన వారిలో దీని కౌంట్ పెరగడం , జ్వరం, నొప్పులూ తగ్గి రోగి స్వస్థత పొందుతున్నారు అని వారు తెలిపేరు.

డెంగు వ్యాధికి అల్లోపతిలో మందులు లేవు. IV ఫ్లూయిడ్లు ఇవ్వడమే దీనికి చికిత్స. అందువలన ఈ వ్యాధి సోకిని వారిలో(ముఖ్యంగా పిల్లలు) చాలామంది చనిపోతున్నారు.....ఈ హోమియోపతి మందును రోజుకు రెండు సార్లు రోగికి ఇవ్వాలి. అల్లోపతి మందులతో కలిపికూడా తీసుకోవచ్చునని వారు తెలిపేరు.

దీనిని మరికొంత సైంటిఫికల్ గా నిరూపించడానికి ప్రయత్నిస్తున్నామని వారు తెలిపేరు.


No comments:

Post a Comment