Thursday, November 29, 2012

2012 "పుష్కర్ కెమేల్ ఫెయిర్" (ఒంటెల జాతర).....ఫోటోలు

భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రం లోని అజ్మీరు జిల్లాలోని ఒక ఊరు పుష్కర్. ఉత్తర భారతదేశంలో ఉన్న ఐదు పవిత్రధామములలో (హిందువుల పవిత్ర తీర్ధాలు) ఇది ఒకటి. ఇది తీర్ధరాజ్ అని హిందువులతో గౌరవించబడుతుంది. పుణ్యక్షేత్రాలలో చక్రవర్తి అయిన ఈ క్షేత్రము విదేశీ భక్తులకు ఒక లక్ష్యక్షేత్రముగా ప్రసిద్ధి చెందింది. భారతదేశంలోని పురాతన నగరాలలో పుష్కర్ ఒకటి. పుష్కర్ సరస్సును చుట్టి విస్తరించి ఉన్న ఈ నగరనిర్మాణము ఎప్పడు మొదలైందో ఎవరికీ అంచనా లేదు. అయినా పురాణ కధనాలను అనుసరించి ఈ నగరానికి రూపకర్త బ్రహ్మదేవుడని చెప్తున్నాయి. బ్రహ్మదేవుడు ఇక్కడ 60,000 సంవత్సరాల కాలం విష్ణుమూర్తిని దర్శించడానికి యజ్ఞముచేసాడని ప్రతీతి. పుష్కర్లో అనేక ఆలయాలు ఉన్నాయి. పుష్కర్లొ ఏటా జరిగే ఒంటెల జాతర ప్రపంచ ప్రసిద్ధి పొందింది. దేశదేశాల నుండి పర్యాటకులు పుష్కర్ కెమేల్ ఫెయిర్ అనే ఈ ఉత్సవానికి విచ్చేయడం ఒక ప్రత్యేకత.


No comments:

Post a Comment