Monday, November 5, 2012

చెత్త తరలింపు బండ్లు: చరిత్రకు 100 ఏళ్ళు దాటింది....ఫోటోలు

చెత్త తరలింపు బండ్లు అనే సామాజిక సేవా బండ్లు మొదలుపెట్టి ఈ సంవత్సరం 100 సంవత్సరాలు పూర్తిచేసుకుందట. దీనికి ఈ సంవత్సరం వార్షికోత్సవం. అమెరికాకు చెందిన జార్జ్ రోబీ డాం స్టర్ అనే ఒక రాజకీయ నాయకుడు 1912 లో చెత్తను బండ్లతో తొలగించటం మొదలుపెట్టేరట. ఆ తరువాత అది ఒక పెద్ద కదలికగా మారి ఈ రోజు అదొక అతిపెద్ద వ్యాపారంగా మారింది.


జార్జ్ రోబీ డాం స్టర్

చెత్త లేదా వ్యర్ధ పదార్ధాలు పెద్ద సమస్యగా మారింది. రోజూ వేల టన్నుల ఉత్పత్తి జరుగుతోంది. ఖర్చుతోపాటు తరలింపునకు స్థలం కరవు ఔతోంది. చెత్తే కదా.. బయట పడేసిరా అని మనం తేలిగ్గా చెబుతాం. కానీ, అదే పెద్ద గుడిబండగా మారింది. మనం వేసిన చెత్తను ఎక్కడికి తరలించాలన్నది తలనొప్పిగా తయారైంది. దీనిని ఎక్కడ వేద్దామన్నా ఆ పరిసర ప్రాంతాల వారి నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చెత్త వేయటానికి అనువైన ప్రదేశం దొరకటం లేదు. ఫలితంగా డంపర్ బిన్లు నిండిపోయి వ్యర్థపదార్థాలు ఆ చుట్టుపక్కల పడుతున్నాయి. జనావాసాల మధ్య దుర్వాసన వెదజల్లుతోంది. చెత్త వేయటానికి వెసులుబాటు లేక అధికారులు కూడా డంపర్ బిన్లు తీసుకెళ్లటం లేదు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. భవిష్యత్తులో మరింత తీవ్రం అయ్యే అవకాశం ఉంది. చెత్తను తొలగించటానికి కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నది. నగరంలో ఉన్న చెత్త తీసుకొచ్చి పోయటం వల్ల వ్యాధులు వస్తాయని ఎక్కడికక్కడ ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఉత్పత్తి అవుతున్న చెత్తను ఎక్కడ పోసినా తగాదాలు జరుగుతున్నాయి. చెత్తను నిర్వీర్యం చేయటం పెద్ద సమస్యే. వాస్తవానికి దానిని సేకరించిన తర్వాత సరైన పద్ధతిలో భూస్థాపితం చేయాలి. లేకుంటే అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఉన్న ఖాళీలో పోసి వస్తున్నారు తప్పించి.. సరైన విధానాన్ని పాటించటం లేదు. దీంతో సమీప ప్రాంతాల్లో దుర్వాసన.. చర్మ సంబంధ వ్యాధులు వస్తున్నాయి.

అభివ్రుద్దిచెందిన దేశాలలో వ్యర్థ పదార్థాల నిర్వహణ బాగా చేస్తున్నారు.


No comments:

Post a Comment