Thursday, November 22, 2012

ప్రపంచంలోని 10 పెద్ద బ్యాంకులు....ఫోటోలు

ఏ దేశానికైనా బ్యాంకులే ఆ దేశ ఆర్ధీక స్థితికి వెన్నుముకలాంటింది. బ్యాంకుల ఆర్ధీక స్థితి సరిగ్గా లేకపోతే ఆ దేశం ఆర్ధీకంగా దెబ్బ తింటుంది.

Industrial and Commercial Bank of China....china
1984 లో మొదలుపెట్టబడిన ఈ చైనా ప్రభుత్వ బ్యాంకు తక్కువ వ్యవధిలో అత్యంత వ్యాపారంచేసింది.ఈ బ్యాంకు యొక్క ప్రస్తుత మూలధనము 240.95 బిల్లియన్ డాలర్లు.

China Construction Bank....china
ఇది కూడా చైన ప్రభుత్వ సంస్థ. ఈ బ్యాంకు యొక్క ప్రస్తుత మూలధనము 195.85 బిల్లియన్ డాలర్లు.

Wells Fargo & Co.....America
మొదటి నుండీ అమెరికా అర్ధీక స్థితిని మెరుగుపరుస్తున్న బ్యాంకు.ఈ బ్యాంకు యొక్క ప్రస్తుత మూలధనము 160.72 బిల్లియన్ డాలర్లు.

HSBC Holdings....U.K
ప్రపంచ బ్యాంకింగ్ పరిశ్రమలో పేరుమోసిన బ్యాంకు. ఈ బ్యాంకు యొక్క ప్రస్తుత మూలధనము 150.90 బిల్లియన్ డాలర్లు.

Agricultural Bank of China....china
1951లో మొదలుపెట్టబడిన ఈ బ్యాంకు కూడా చైనా ప్రభుత్వ బ్యాంకే.ఈ బ్యాంకు యొక్క ప్రస్తుత మూలధనము 141.72 బిల్లియన్ డాలర్లు.

JP Morgan Chase....America
1799 నుండి అమెరికా దేశానికి ఆర్ధిక బలం చేకూర్చిన బ్యాంక్ ఇది. ఇప్పుడు కూడా అమెరికా దేశ అర్ధీక స్థితి ని నిలబెడుతున్న బ్యాంక్ ఇది.

Bank of China....china
ఇది చైనా ప్రభుత్వ బ్యాంకు. ఈ బ్యాంకు యొక్క ప్రస్తుత మూలధనము 128.8 బిల్లియన్ డాలర్లు.

Itau UniBanco....Brazil
ఈ లిస్టులో బ్రిజిల్ బ్యాంకు వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. వచ్చిందీ అంటే ఆ బ్యాంకు ఎంత గొప్పగా వ్యాపార లావాదేవీలు చేసిందో అర్ధంచేసుకోవచ్చు. బ్రెజిల్ దేశానికి ఈ బ్యాంకు పేరుప్రతిష్ఠలు తెచ్చింది. ఈ బ్యాంకు యొక్క ప్రస్తుత మూలధనము 88.18 బిల్లియన్ డాలర్లు.

CitiGroup.....America
140 దేశాలో 16,000 బ్రాంచులున్న ఒకే ఒక బ్యాంకు. ఈ బ్యాంకు యొక్క ప్రస్తుత మూలధనము 86.67 బిల్లియన్ డాలర్లు.

The Commonwealth Bank....Australia
1911 లో మొదలు పెట్టిన ఈ బ్యాంకు యొక్క ప్రస్తుత మూలధనము 82.62 బిల్లియన్ డాలర్లు.

No comments:

Post a Comment