Monday, October 8, 2012

సహారా ఎడారి లోని సరస్సులు....ఫోటోలు

సహారా అంటే అరబ్బీ భాషలో అతిపెద్ద ఎడారి అని అర్థం. గణాంకాల ప్రకారం అంటార్కిటికా తరువాత ప్రపంచములోనే రెండవ అతి పెద్ద ఎడారి. ఈ ఎడారి వైశాల్యం 9,000,000 చదరపు కి.మీ (3,500,000 చదరపు మైళ్ళు). వైశాల్యంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలంత పెద్దది,ఆస్ట్రేలియా కంటే పెద్దది. ఈ ఎడారి ఉత్తర ఆఫ్రికా ఖండంలో ఎర్ర సముద్రం నుండి మధ్యధరా సముద్రతీర ప్రాంతం వరకు, అట్లాంటిక్ మహాసముద్రం పొలిమేర వరకు విస్తరించి ఉన్నది.

సహారా ఎడారిలోని ఉత్తర చడ్ ప్రాంతం లో Ounianga సరస్సులు ఉన్నాయి. 18 చిన్న చిన్న సరస్సులు కలిగియున్న దీనిని Ounianga సరస్సులు అంటారు. ఈ చోట సంవత్సరానికి 2mm వర్షపాతం పడితే అదే ఎక్కువ వర్షపాతం. అయితే ఇక్కడ ఈ సరస్సులు ఉండటమేమిటా అనే అనుమానం కలగవచ్చు. సుమారు 14,000 సంవత్సరాల క్రితం ఈ ప్రదేశమంతా తడిప్రదేశంగా ఉండేదట. అప్పుడు ఈ సరస్సులన్నీ కలిపి ఒకే నదిగా ఉండేదట. అప్పుడు శిలాజ నీరుగా ఉన్న ఈ నది అక్కడి వాతావరణ మార్పిడివలన ఆవిరైపోయి చిన్న చిన్న సరస్సులగా మిగిలిపోయింది. వర్షపాతమే లేని ఈ చోట నీరు ఎలా ఉంటోంది అనే అనుమానం కూడా కలుగుతుంది. అక్కడ భూమిక్రిందున్న కొండప్రదేశంలోని రాల్లలోనుండి నీరు వస్తూవుండటం వలన సంవత్సరమంతా ఎండతో నీరు ఆవిరైపోతున్నా ఈ సరస్సులలో నీరు ఉంటూనే ఉంటుందట.


ఇది నాసావారు అంతరిక్షం నుండి తీసిన ఫోటో

No comments:

Post a Comment