Thursday, October 4, 2012

దేశ ఆర్థిక భవిష్యత్తు గురించి మెజారిటీ భారతీయుల్లో ఆందోళన పెరిగిపోతోంది....ఫోటోలు

అవినీతి, లంచగొండితనం.. లక్షల కోట్ల కుంభకోణాలు.. దూరదృష్టి లేని రాజకీయ నాయకులు.. పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం.. మందగిస్తున్న ఆర్థిక వృద్ధి.. చుక్కలనంటుతున్న నిత్యావసరాల ధరలు..! దేశంలో ఇంత దారుణ పరిస్థితి మునుపెన్నడూ చూడలేదని మెజారిటీ భారతీయులు అభిప్రాయపడుతున్నారు! ఒకరుకాదు.. ఇద్దరుకాదు.. 60 శాతం ప్రజలు దేశ గతిపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.


గత ఏడాదితో పోలిస్తే.. దేశ స్థితిగతులపై ప్రజల సంతృప్తి 13 శాతం తగ్గిపోయింది. 2011, 12 సంవత్సరాల్లో 21 దేశాల్లో ప్రజల సంతృప్తస్థాయులపై అమెరికాకు చెందిన 'ప్యూ రిసెర్చ్ సెంటర్' నిర్వహించిన సర్వే ఫలితాలివి. "దాదాపు ప్రతి పదిమంది భారతీయుల్లో ఆరుగురు తమ దేశ గతిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం 38 శాతం మాత్రమే దేశ పరిస్థితుల పట్ల సంతృప్తిగా ఉ న్నారు'' అని ఈ పోల్ నివేదిక పేర్కొంది. ఇక.. దేశంలో ప్రతి పది మంది భారతీయుల్లో ఎనిమిది మంది నిరుద్యోగిత, ధరల పెరుగుదల పెద్ద సమస్యలుగా భావిస్తున్నారని పోల్ లో తేలింది. భారత ఆర్థిక వ్యవస్థ మంచి స్థితిలోనే ఉన్నదని అభిప్రాయపడ్డవారు 49 శాతం.


దేశంలో 64 శాతం ప్రజలు తమ వ్యక్తిగత ఆర్థిక స్థితిపై సంతృప్తి వ్యక్తం చేశారు. అదే సమయంలో, తమ పిల్లల హయాం వచ్చేసరికి వారికి మంచి ఉద్యోగం లభించడం కష్టమవుతుందేమోనని 66 శాతం ప్రజలు అభిప్రాయపడ్డారు. ధనిక, పేద వర్గాల మధ్య అంతరాలు పె రిగిపోవడం అతిపెద్ద జాతీయ సమస్య అని 72 శాతం పేర్కొనడం గమనా ర్హం.జీవితాల్లో ఆధునికత చొచ్చుకురావడంపై 49 శాతం భారతీయులు ఇష్టపడగా.. సంప్రదాయాలు కనుమరుగైపోతున్నాయని 52 శాతం నొచ్చుకున్నారు. మన సంప్రదాయాలను కాపాడుకోవాలని 79 శాతం ప్రజలు భావిస్తున్నారు.


ఇక.. 2012 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భార త ఆర్థిక వృద్ధి రేటు 5.3 శాతానికి మందగించింది. గత తొమ్మిదేళ్లలో ఇది అత్యంత కనిష్ఠస్థాయి!!


No comments:

Post a Comment