Saturday, October 6, 2012

ప్రపంచంలో అక్టొబర్ నెలలో జరిగే కొన్ని పండుగలు....ఫోటోలు

జెర్మనీ...ప్రతి సంవత్సరం అక్టొబర్ 6 న జరిగే ఈ పండుగ పేరు బాతు పందేలు. అయితే ఇందులో నిజమైన బాతులను ఉపయోగించరు. పసుపుపచ్చ రంగులో ఉండే రబ్బర్ బాతు బొమ్మలను ఈ పందెంలో ఉంచుతారు. బొమ్మలు తలక్రిందలవకుండా ఉండటానికి బాతు బొమ్మకు చిన్న ఇనుప ముక్కను కడతారు. ఈ పందెంలో వందలాది మంది పాల్గొంటారు. బాతు బొమ్మల మీద పేర్లు రాసుకుంటారు. పందెంలో మొత్తం 10,000 యూరోలు బహుమతి ఉన్నది.

అక్టొఫెస్ట్ అన్న పేరుతో జరిగే ఈ పండుగ గూడా జెర్మనీలోనే జరుగుతుంది. జెర్మనీలోనే అత్యంత రుచికరమైన బెవిరియన్ బీర్ ను ఈ పండుగలో వాడతారు. ఆటలూ, పాటలూ మరియూ నాట్యాలూ కూడా జరుగుతాయి.

భారతదేశాంలో రాజస్తాన్ లో ఆక్టొబర్ నెలలో ఈ పండుగ పేరు పుష్కర్ కేమల్ ఫేర్. ఇక్కడ వేలాది ఒంటెలను అమ్ముతం మరియూ కొనడం జరుగుతుంది.ఒంటె పందేలూ, ఫాన్సీ డ్రెస్ పెరేడ్ కూడా జరుపుతారు. 5 రోజులు జరిగే ఈ పండుగను చూడటానికి అనేక మంది విదేశీయులు కూడా వస్తూ ఉంటారు.

హాలోవెన్ అనే ఈ పండుగను అక్టొబర్ 31 న ప్రపంచంలో పలుచోట్ల జరుపుకుంటారు. దుష్ట శక్తులను తరిమివేసే రోజుగా ఈ రోజును పరిగణిస్తారు. ఈ పండుగలో పాల్గొనే వారు ఎక్కువగా గుమ్మడికాయలను ఉపయొగిస్తారు. చిన్న పిల్లలకు గుమ్మడికాయ పోలిన డ్రెస్స్ లను వేస్తారు.

దసరా.భారతదేశంలో జరుపుకునే ఈ పండుగ గురించి మీకు ఎక్కువగా చెప్పక్కరలేదు. ఇది కూడా దుష్ట శక్తులను ఏరిపారేసే పండుగే.

పుకెట్ వెజిటేరియన్ పండుగ. ఇది చైనాలో ప్రతి సంవత్సరం అక్టొబర్ నెలలో జరుగుతుంది. చైనా వారి క్యాలండర్ ప్రకారం అక్టోబ్ర్ నెల చంద్రుని నెలగా అనుసరిస్తారు. ఆ నెలలో వారు ఎటువంటి మాంశాహారం ముట్టుకోరు. పూర్తిగా శాకాహారమే తింటారు. అలా ఆ నెలలో చేస్తే వారికి పూర్తి ఆరొగ్యమూ, మనశ్శాంతి లభిస్తుందని వారి నమ్మకం.

నాగా ఫైర్ బాల్ పండుగ. తాయ్లాండ్లో జరిగే ఈ పండుగ మేకాంగ్ అనే ఒక నదిలో మనుష్యులను తినే రాక్షస సర్పం ఉన్నదని, దానిని తరిమి కొట్టడానికి ఫైర్ బాల్స్ ఎగరేస్తారు.


చంద్రుని పండుగ. ఇది చైనా మరియూ వియత్నాం లో జరుగుతుంది. ఈ నెలలో చంద్రుడు చాలా కంతివంతంగా ఉండి ప్రజలకు చల్లటి వెన్నలను ఇస్తూ వారికి అనందం కలిగిస్తాడని ఆయనకు థాంక్స్ చెప్పడంకోసం జరుపుతారు.

No comments:

Post a Comment