Sunday, October 28, 2012

“శాండీ'”పెను తుపాను కారణంగా అమెరికాలో ఎమర్జెన్సీ: న్యూయార్క్ నగరానికీ పెనుతుఫానలకూ మధ్య కొన్ని నిజాలు....ఫోటోలు

కరేబియన్ దీవుల్లో పుట్టిన పెను తుపాను 'శాండీ' అమెరికా దిశగా ప్రయాణిస్తోంది. హైతీని అతలాకుతలం చేసిన ఈ పెనుతుపాను అమెరికా వైపు పయనిస్తోంది. అమెరికా తూర్పు తీరంపై శాండీ తుపాను విరుచుకుపడనున్న నేపథ్యంలో ఉత్తర కరోలినా, కనెక్టికట్, న్యూజెర్సీ, న్యూయార్క్, డెలావేర్ తదితర రాష్ట్రాల్లో శనివారం ఎమర్జెన్సీ ప్రకటించారు. వరద తాకిడి ఉండే హైవేలను మూసేయాలని నిర్ణయించారు. సోమ, మంగళవారాల్లో శాండీతుపాను అమెరికాను తాకవచ్చని భావిస్తున్నారు. దీనికితోడు రెండు భారీ చలి తుపానులు కూడా ఒకేసారి చుట్టుముట్టనుండటంతో తూర్పు తీర ప్రాంతంలో నివసిస్తున్న లక్షలాది మంది పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు ఆదేశించారు.

తుపానువల్ల కొన్ని రోజులపాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడవచ్చని...ప్రజలంతా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని, తగినన్ని ఆహార నిల్వలను కూడా సిద్ధం చేసుకోవాలని కోరారు.


No comments:

Post a Comment