Thursday, October 4, 2012

గనుల్లో తవ్వకుండా బాక్టీరియాతో తయారయ్యే బంగారం...ఫోటోలు

అదో శక్తిమంతమైన బ్యాక్టీరియా. విషపూరితమైన లోహాలను సైతం తేలికగా అరిగించుకుంటుంది. పకృతిలో సహజసిద్ధంగా ఏర్పడే 'గోల్డ్ క్లోరైడ్' (లిక్విడ్ గోల్డ్ అని కూడా అంటారు)ను ఈ బ్యాక్టీరియా తినేసి వారం రోజుల్లో బంగారం ముద్దలను విడుదల చేస్తుందని పరిశోధన బృందం వెల్లడించింది.


గనుల్లో తవ్వకుండా బంగారాన్ని తయారుచేయవచ్చు. అందుకు కొన్నిరకాల సూక్ష్మజీవులు ఉపయోగపడతాయి. 'గోల్డ్ క్లోరైడ్' అనే విష పదార్థాన్ని 'క్యూప్రియవిడస్ మెటల్లిడ్యురాన్స్' అనే బ్యాక్టీరియా అచ్చమైన బంగారంగా మారుస్తుందని మిచిగన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు.


ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు వ్యాపారమంతా బంగారం చుట్టే తిరుగుతుండటంతో ప్రపంచ దేశాలన్నీ బంగారం నిల్వలను పెంచేసుకుంటున్నాయి. ఈ విషయంలో ముఖ్యంగా భారత్, చైనా పోటీ పడుతున్నాయి. మరోపక్క బంగారు గనుల్లో ఉత్పత్తి తగ్గిపోతోంది. మరి.. భూమిలోని బంగారమంతా అయిపోతే ఎలా? అందుకే ఈ లోహాన్ని తవ్వి తీయకుండా తయారు చేయాలని ఎంతోకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.


సూక్ష్మ జీవులు పాటించే రసాయనిక ప్రక్రియనే ప్రయోగశాలలో అమలు చేశాం. ప్రకృతిలో ఎలాంటి విలువ లేని పదార్ధం నుంచి ఎంతో విలువైన బంగారాన్ని ఉత్పత్తి చేశాం' అని శాస్త్రవేత్తలు వివరించారు. ఈ ప్రయోగాన్ని ‘గ్రేట్ వర్క్ ఆఫ్ మెటల్ లవర్’ పేరుతో ఆర్ట్ ఇన్స్టలేషన్ గా కూడా రూపొందించామని, దీనిని ఆస్ట్రియాలో జరగనున్న సైబర్ ఆర్ట్ కాంపిటీషన్లో ప్రదర్శించనున్నామని తెలిపారు.


అయితే, ఈ పద్ధతిలో బంగారు తయారీ వల్ల పర్యావరణ, ఆర్థిక, నైతికపరమైన అనేక సందేహాలు వ్యక్తమయ్యే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


ఈ బంగారానికి డిమాండ్ ఉంటుందో లేదో?

No comments:

Post a Comment