Wednesday, October 31, 2012

నిన్న చెన్నై నగరాన్ని ఇబ్బంది పెట్టిన "నీలం" తుఫాన.....ఫోటోలు

తమిళనాడును, ముఖ్యంగా చెన్నై నగరాన్ని భయపెట్టిన "నీలం" తుఫాన నిన్న మహాబలిపురం వద్ద తీరం దాటింది.

కలవరపెట్టిన ఈ తుపాను తమిళనాడులోని మహాబలిపురం వద్ద తీరాన్ని దాటింది. ‘నీలం’ ఉత్తర వాయవ్య దిశగా పయనించి మహాబలిపురం వద్ద బుధవారం సాయంత్రం 4-5 గంటల మధ్య తీరాన్ని దాటింది. తీరాన్ని దాటే సమయంలో చెన్నై పరిసరాల్లో గంటకు 65-80 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచాయి.

నీలం తుపాను, భారీ వర్షాల కారణంగా తమిళనాడులో ఇద్దరు, మరణించారు. భారీ వర్షాలకు ప్రజలు అవస్థలు పడ్డారు. పలుచోట్ల భారీ వృక్షాలు, విద్యుత్ స్తం భాలు కూలి.. కరెంటు సరఫరా నిలిచిపోవడంతో అంధకారం నెలకొంది. రైళ్లు, విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని రైళ్లు, విమానాలు రద్దయ్యాయి.

నిన్న ప్రొద్దున 11 గంటలకు పోయిన కరెంటు ఈ రోజు 9 గంటలకు వచ్చింది.


No comments:

Post a Comment