Monday, September 3, 2012

సల్ఫర్(Sulfur) లేదా గంధకము మైనింగ్ ఇండోనేషియాలో ఎలా జరుగుతోందో చూడండి...ఫోటోలు

సల్ఫర్ లేదా గంధకము ఒక రసాయన మూలకము. ఇది భూమిపై విరివిగా లభించే ఒక లోహేతర మూలకము. . ప్రకృతి సహజంగా లభ్యమయ్యే సల్ఫర్పసుపు రంగులో ఉండే స్ఫటిక ఘన పదార్ధము. ఇది మూలక రూపంలోను, సల్ఫైడ్, సల్ఫేటు అనే రసాయన సంయోగరూపంలోను కూడా ప్రకృతిలో లభిస్తుంది. భూమిపై జీవపదార్ధాలకు కావలిసిన అత్యవసర పదార్ధాలలో గంధకం ఒకటి.సిస్టీన్ మరియు మితియోనీన్ అనే రెండు అమినో ఆమ్లాలలో (amino acid) గంధకం అణువులు ఉంటాయి. వాణిజ్య పరంగా గంధకం వినియోగించే పదార్ధాలు - ఎరువులు, గన్ పౌడర్, అగ్గిపుల్లలు, పురుగు మందులు, ఫంగస్ నివారణ పదార్ధాలు.

ఇండోనేషియాలోని ఈస్ట్ జావా ప్రదేశంలో ఖవహ్ ఈజెన్ అనే అగ్నిపర్వతం ఉన్నది. సల్ఫర్ మైనింగ్ చేసే వారు ఈ అగ్నిపర్వతపు కొనకు వెళ్ళి అక్కడ నుండి జ్వాలాముఖి దగ్గరకు వెళ్ళి అక్కడ పారుతున్న సల్ ఫ్యూరిక్ యాసిడ్ ను తీసుకుని మరియూ అక్కడున్న సల్ఫర్ రాళ్ళను కూడా తీసుకుని వస్తారు......ఆ తరువాతా దానిని రసాయనంగానూ , పౌడర్ గానూ తయారుచేసి అమ్ముతారట.


No comments:

Post a Comment