Thursday, September 20, 2012

E.T సినిమా గురించిన ఆశక్తికరమైన విషయాలు....ఫోటోలు

E.T మరియూ ఇండియానా జోన్స్ సంబంధము....E.T సినిమాలో ఇండియానా జోన్స్ నటించలేదని మీ అందరికీ తెలుసు. అయితే సంబంధము ఉన్నది. E.T సినిమా యొక్క పూర్తి కధను రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్ సినిమా షూటింగు లోకేషన్లలో రాసేరు. కొన్ని సీన్లు హారిసన్ ఫొర్డ్ తో తీసేరు. కానీ ఆ తరువాత ఆ సీన్లన్నీ కట్ చేసేరు.

E.T యొక్క సందేశ యంత్రం నిజంగానే పనిచేసింది.....భూమి మీద ఇరుక్కుపోయిన E.T అన్యగ్రహంలో ఉన్న తన కుటుభంతో మాట్లాడే ఫోన్ నిజంగానే తయారుచేయబడింది. సైన్స్ మరియూ టెక్నాలజీ నిపుణులు Henry Feinberg తయారుచేసిన సందేశ యంత్రం నిజంగానే పనిచేసిందట.

సినిమాలో తుపాకులను తీయడానికి 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టేరు.....ఈ సినిమాను మొదట రిలీజ్ చేసినప్పుడు ఎక్కువగా తుపాకులు వాడటం, హింస సీనులు ఎక్కువగా ఉండటం తెలుసుకున్న స్టీఫన్ స్పిల్ బర్గ్ పిల్లల సినిమాలో ఇంత హింసాకాండును చూపించకూడదని మొత్త సినిమాలోనూ తుపాకులను తీయించేరట. దానికి 50 లక్షల రూపాయలు ఖర్చు అయ్యిందట.

E.T నిమాసిలో నిజంగానే భయంకరమైన పువ్వులు ఉన్నాయి.....E.T అంతరిక్ష నౌక లో చూపిన పూలలో కొన్ని బలూన్లతో తయారుచేసినవైనా, కొన్ని మాత్రం అరుదుగా కనిపించే విక్రుత రూపంలో ఉన్న నిజమైన పూవులేనట.

E.T సినిమా మరింత భయం కలిగించేదిగా ఉండేదట.....E.T సినిమాను మొదట్లో చాలా భయం కలిగించేదిగా ఉండాలని అంతరిక్ష నౌకను అతి భయం కలిగించేదిగా తయారుచేసేరట. తరువాత మార్చేరట.

అన్ని సీన్లనూ వరుసక్రమంలో తీసిన ఒకే సినిమా ఇది......మామూలుగా సినిమా తీసేటప్పుడు స్క్రిప్ట్ మొదటి పేజీ నుండి చివరి పేజీ వరకు అలాగే తీయరు. వారి వీలును బట్టి ఎక్కడి నుండైనా మొదలుపెట్టి, మధ్యలోవి తీసుకుంటూ సినిమా ముగిస్తారు. కానీ E.T సినిమాను మాత్రం స్క్రిప్ట్ కు తగినట్లు మొదటి పేజీ నుండి చివరిపేజీ వరకు వరుసక్రమంగా తీసేరు.

E.T సినిమాలో E.T గా చూపించిన వన్నీ బొమ్మలు కాదు....E.T సినిమాలో E.T లుగా కనిపించే వారిలో కొందరు నిజమైన మనుష్యులు.

E.T లకు వాడిన కంఠము....బాగా వయసు మల్లిన వారినీ, గొంతు సరిగ్గా లేక కంఠము బోరగా వచ్చేవారినీ ఉపయోగించేరు మరియూ ఈ క్రింది ఫోటోలో చూపిన కుక్క అరుపును బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గా వాడేరట.

E.T చూపులు.....E.T చూపులు ఎలా ఉండాలో ఈ ఫోటోలో ఉన్న ముఖ కవళికలను బట్టి తీసేరట.

No comments:

Post a Comment