Monday, September 3, 2012

గోరింటాకు(మెహంది)అందంతో పాటూ ఆరోగ్యమూ ఇస్తుంది....ఫోటోలు

గోరింటాకును గురించి తెలియని మహిళలే ఉండరు. స్త్రీల అలంకరణ సాధనాల్లో గోరింటాకు ఒకటి. గోరింటాకు ఎన్నో ఔషధగుణాలను కలిగిందని మన పూర్వీకులు దాన్ని అలంకరణకు ఉపయోగిస్తూ వచ్చారు.గోరింటకు పెట్టుకుంటే అది మనిషిలోని లోపలి శక్తిని మేలుకొలిపి బయటి సూర్య శక్తితో అనుభందం తెస్తుందని వేదాలు చెప్పినట్లు చెప్పబడింది. ఇందులో ఎవరికీ ఎటువంటి సందేహం ఉండదేమో. ఎందుకంటే బహూశ అందరికీ గోరింటాకు యొక్క మెడికల్ విలువలు తెలిసే ఉంటాయి. పసుపు కూడా ఇలాగే మేలు చేస్తుందని పసుపు కూడా రాసుకుంటారు.

మానవ చర్మం మీదున్న కెరటిన్ అనే ఎంజైం గోరింటాకులోని లాసోన్ అనే ఎంజైముతో కలవడం వలనే గోరింటాకు పెట్టుకుంటే చర్మం ఎర్రబడుతుంది....... పసుపు యొక్క ఔషధగుణాలను తెలుసుకున్న పశ్చిమ దేశాలు దానిని పేటెంట్ చేసేరు. ఈ మధ్య వారు (పశ్చిమ దేశస్తులు) గోరింటాకు యొక్క ఔషధగుణాలను తెలుసుకున్నారు గోరింటాకును వారుకూడా వాడుతున్నారు. గోరింటాకును కూడా వారు పేటంట్ చేసేసుకుంటారేమో?


1 comment: