Sunday, September 9, 2012

రైల్వే స్టేషన్లో బొటానికల్ గార్డన్....ఫోటోలు

స్పైన్ దేశంలోని మాద్రిద్ రైల్వే స్టేషన్లో అద్బుతమైన బొటానికల్ గార్డన్ ఉన్నది. అటోచా అనే పేరున్న ఈ రైల్వే స్టేషన్లో 4000 చదురపు మీటర్లకు బొటానికల్ గార్డన్ ఉన్నది. స్పైన్ దేశంలో ఈ చోట ఉష్ణోగ్రత అధికంగా ఉంటుందట. వేసవి కాలంలో ఉండే ఎండ నుండి ప్రజలకు నీడ కల్పించాలని రైల్వే స్టేషన్ మొత్తం కప్పబడింది. అక్కడ తోటలను కూడా ఏర్పాటుచేసేరు. చిన చిన్న కోల్నులు కూడా ఏర్పాటుచేసి అందులో తాబేళ్ళను, 22 రకాల చేపలనూ ఉంచేరు. 1851 లో ప్రక్రుతీ పరంగా చెట్లూ, కోలనులూ నిండి ఉన్న ఈ ప్రదేశంలో మొదటిసారి రైల్వే స్టేషన్ ఏర్పాటుచేసేరు. 1892 లో ఒక అగ్నిప్రమాదంలో ఈ స్టేషన్ తో పాటూ అక్కడున్న చెట్లు కూడా తగలబడిపోయినైయట. ఎన్నోసార్లు పునర్నిర్మాణం చేసేరు కానీ మొదట ఉన్నట్లు చేయలేకపోయేరట. చివరికి 1992 లో అనుకున్నట్లు చేయగలిగేరట.


1 comment: