Friday, September 7, 2012

భారదేశంలోని అపూర్వమైన, అసాధారణమైన, మర్మమైన కొన్ని ప్రదేశాలు...ఫోటోలు

Thalon Cave – Manipur.....మనిపూర్ లోని తామెంగ్లాంగ్ అనేచోట సముద్ర మట్టానికి 910 మీటర్ల ఎత్తున ఉన్న ఈ గుహలు...లోనికివెడితో కటిక చీకటితో రకరకాల శబ్ధాలతో భయం గొలిపేదిగా ఉంటుందట.

Hide-and-Seek Beach of Orissa.....ఇక్కడికి వెడితే అందరికీ ఏదో ఒక మాయాలోకానికి వెళ్ళిన అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే ఈ బీచ్ లో నుండి వచ్చే అలలు ప్రతిసారీ 5 కిలోమీటర్లు ముందుకు ప్రవహించటం వెంటనే 5 కిలోమీటర్లు లోపలికి వెళ్ళటం జరుగుతుంది.

Living Root Bridges of Cherrapunji......ఇక్కడికి వెడితే ప్రక్రుతీపరమైన వంతెనలను చూడవచ్చు(చెట్ల వేర్లతో అల్లుకున్న/అల్లబడ్డ వంతెనలు)

Mohammadpur Umri....అలహాబాద్ దగ్గరున్న ఉమ్రీ అనే ఈ జిల్లా ప్రపంచంలోనే అధిక కవలలు కలిగిన ప్రదేశం

The Levitating Stone at Shivapur....మహారాష్ట్రంలో ఉన్న ఈ సివపుర్ అనే గ్రామంలో ఎగిరే రాయి ఉన్నది. ముంబైకి తూర్పున 185 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో ఉన్న ఒక మసీదులో 11 మంది కలిసి తమ చూపుడు వేలు ను పైకి చూపిస్తూ "Qamar Ali" అనే మత గురువు పేరును చెపితే అక్కడున్న ఒక రాయి పైకిలేచి వారందరి తలలకు పైకి ఎగురుతూ ఉంటుందట.

Bara Imambara....బరా ఇమాంబరా అనే ఈ భవనం భూ ఆకర్షణ శక్తిని ఉల్లంఘించు విధంగా కట్టినదట. 15 మీటర్ల ఎత్తున్న ఈ భవనానికి 16 మీటర్ల పొడవుకు ఎటువంటి బీం లూ లేకుండా సీలింగ్ వేయబడినదట.

Magnetic Hill Ladakh.....Leh-Kargil-Batalik నేషనల్ హై వే లో ఈ ప్రదేశంలో కొండపైకి వెళ్ళే వాహానాలు ఇక్కడకు వచ్చిన తరువాత ఇంజెన్ అపేయవచ్చు. ఎందుకంటే ఇక్కడి నుండి కొండ పై వరకూ ఆ వాహనాలు వాటంతట అవే పైకి ఎక్కుతాయట. ఎక్కే వేగం కనీసం 10 కిలోమీటర్ల స్పీడ్ ఉంటుందట.

2 comments:

  1. baavunnayi magnetic hill photolo vehhicals photo choopincha valasindi unte choopinchandi inka baavuntundi
    sudarsan, editor, praja patrika Rajahmunddy

    ReplyDelete