Wednesday, September 26, 2012

పాత టెలిఫోన్ బాక్స్ లను లైబ్రరీ గానూ, ఆక్వేరియంగానూ మార్చుకున్నారు....ఫోటోలు మరియూ వీడియో


పాత రోజుల్లో మీరు ఎర్రటి టెలిఫోన్ బూత్ చూసే ఉంటారు. మనలో కొందరం వాటిని వాడే ఉంటాము. ప్రైవసీ కోసం దానికి తలుపుకూడా ఉండేది. తరువాత రోజులు మారేయి. సెల్ ఫోన్లు వచ్చేయి. ప్రైవసీ మర్చిపోయి ఎక్కడపడితే అక్కడ నుండి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరిదగ్గర కనీసం ఒక సెల్ ఫోన్ ఉండేఉంటుంది. అందుకనో ఏమో ఆ ఎర్ర బాక్స్ లను తీసేసేరు. ఇప్పుడు పబ్లిక్ టెలిఫోన్ సిస్టం ఉన్నా దానిని అతి తక్కువమంది వాడుతున్నారు. ఇప్పుడు ఆ టెలిఫోన్లలో మాట్లాడటానికి ప్రైవసీ లేదు.

ఇంగ్లాండ్ మరియూ జపాన్ దేశాలలో వాటిని(ఎర్ర టెలెఫోన్ బాక్సులను) వేరే విధంగా వాడుతున్నారు. ఇంగ్లాండ్లో వాటిని లైబ్రరీగా ఉపయొగిస్తున్నారు. ఎవరైనా ఆ లైబ్రరీలో పుస్తకాలు తీసుకోవచ్చు. కానీ వారు తీసుకున్న పుస్తకాలకు బదులు వారు వారిదగ్గరున్న చదివేసిన పుస్తకాలను అక్కడ ఉంచాలి. ఇక జపాన్లో అయితే వాటిని (పాత టెలిఫోన్ బాక్సులను) పబ్లిక్ ఆక్వేరియంలుగా మార్చుకున్నారు. పనులలో తలమునకలైన వారు ఆ ఆక్వేరియంల దగ్గర కొంత సేపు సేద తీర్చుకోవచ్చు, మనసును ప్రశాంతత చేసుకోవచ్చు......ఈ ఐడియాలు బాగానే ఉన్నాయి.

ఇది ఇంగ్లాండ్లో


ఇది జపాన్లో



1 comment:

  1. అచ్చు తెలుగు పుస్తకాలకు ప్లీజ్ visit :

    http://www.logili.com/

    మీకు బాగా నచ్చిన పుస్తకాల గూర్చి మీ అభిప్రాయాలను,
    రివ్యూ లను వ్రాసి ఈ మెయిల్ అడ్రస్ కు పంపించండి
    review@logili.com
    నచ్చిన రివ్యూ లను మీ పేరు లేక మీ కలం తో ప్రచురింపబడును.

    ReplyDelete