Wednesday, September 5, 2012

పదునైన ఆలోచనలకు "మౌన వ్రతం" ఒక మంచి వైద్యమట...!

మెదడును ప్రశాంతంగా ఉంచుకుంటే అది మన ఆరోగ్యానికేకాకుండా పదునైన మంచి ఆలోచనలకు నిలయంగా ఉంటుందట. మనం మాట్లాడుతున్నప్పుడు మనలోని జీవశక్తి(Energy) మనల్ని విడిచి వెడుతుందట. మనం మాట్లాడకుండా ఉంటే మనలోని ఆ జీవశక్తిని పదిలపరుచుకోవచ్చట. దీనివలన మనం మాట్లాడుతున్నప్పుడు పోగొట్టుకునే జీవశక్తిని పునరుద్ధరించుకోవచ్చునట. ఎంత తక్కువగా మాట్లాడితే అది మని అంత మంచి చేస్తుందట. "ఎక్కువగా మాట్లాడకు" అని మన పెద్దలు చెప్పిన మాటలు ఇప్పుడు అర్ధమౌతోంది. ఈ మధ్యకాలంలో ఎక్కువమంది ఇలా అనుకోవడం రానురానూ పెరుగుతోందట. ఇది మంచి విషయమే.


ఈ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా, ఎటు చూసినా శబ్ధాలే వినబడుతున్నాయి. సెల్ ఫోన్ రింగ్ టోన్లు, ఫేస్ బుక్ ఫ్లాష్లు,ఎఫ్.ఎం.రేడియో పాటలు, టీ.వీ మోతలు, 24/7 ట్వీట్లు లాంటివాటితో ప్రజలు తమ సొంత ఆలోచనలకు టైము ఇవ్వకుండా గడిపేస్తున్నారు. భారతదేశంలో పురాతణ కాలం నాటి నుండి ఇప్పటివరకూ ఆధ్యాత్మిక శాస్త్రము మౌనంగా ఉండటం వలన మానవునుకి ఎన్ని లాభాలున్నాయో చెబుతూనే ఉన్నాయి. అదే 'మౌన వ్రతం".


ఎవరైతే వారికివారే సందేశాలను సూచించుకోవాలనుకుంటున్నారో వారికి ఈ "మౌన వ్రతం" చాలా ఉపయోగపడుతుందట. దీనిని సప్రమాణమైన రీతిలో చేయగలిగితే:...అంటే, మొదటిరోజు సూర్యోదయం నుండి మరిసటి రోజు సూర్యోదయం వరకు మౌన వ్రతం చేపట్టగలిగితే అది చాలా లాభాలను ఇస్తుందని ఒక యోగా మిషన్ అధినేత తెలిపేరు.

మౌనంగా ఉండటం వలన ఆ మౌన వ్రతం పూర్తైన తరువాత మనం మాట్లాడే విధానంలో స్వచ్చత తెచ్చుకోవచ్చు. మౌనంగా ఉన్నప్పుడు మనం మాట్లాడటం చేయం కాబట్టి వినడం, ఆలొచించడమే చేస్తాం.

ఇప్పుడు ఈ "మౌన వ్రతం" మనదేశంలో కంటే విదేశాలలో ఎక్కువగా పాటించబడుతోందట. "ఇది ఒక MBA Refreshing కోర్స్ లాగా. అక్కడ మనం మేనేజ్మెంట్ గురించి తెలుసుకుంటాము. ఈ మౌన వ్రతం మూలంగా మనం మన జీవితం గురించి, అంతకంటే ఎక్కువగా మన గురించి తెలుసుకుంటాము. ఆ తరువాత మనచుట్టూ ఏం జరుగుతున్నదో మనం తెలుసుకోగలము" అని ఒక విదేశీ సంస్థ యజమాని తెలిపేరు.


ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మికంగా మౌనవ్రతం పాఠించడం వల్ల చాలా ఉపయోగం ఉంది. ఆధ్యాత్మికంగా మౌనాన్ని పాటిస్తే వాక్సుద్ధి, వాక్శక్తి పెరుగుతాయి. ఇంకా ఆవేశం, కోపం, రోగాలను నియంత్రిస్తుంది.

మౌన వ్రతాన్ని పాటించడం ద్వారా మనస్సులో ప్రశాంతత వాతావరణం ఏర్పడుతుంది.

ఈ ప్రశాంతత ద్వారా టెంక్షన్లు, అశాంతి, కోపతాపాలకు దూరంగా ఉండవచ్చునని పండితులు చెబుతున్నారు. అలాగే ఆరోగ్యపరంగానూ మౌనవ్రతం మేలు చేస్తుందని వారు అంటున్నారు.

3 comments:

  1. may be this is the reason why our honorable PM always keep silent.

    ReplyDelete
  2. మన్మోహన్ సింగ్ అందుకే 8ఏళ్ళుగా మౌనవ్రతం పాటిస్తున్నారేమో. పదునేమో కాని, పరిస్థితి రానురానూ క్షీణించి పోతోంది. దారిన పోయే దానయ్యల్లాంటి టైం, వాషింగ్టన్ పోస్ట్‌లు కూడా ఓ చెయ్యివేసిపోతున్నాయి.

    ReplyDelete