Thursday, September 13, 2012

జల సత్యాగ్రహం.....ఫోటోలు

గాంధీజీ ప్రసాదించిన అహింసాయుత ఆందోళన రూపం సత్యాగ్రహం. న్యాయాన్ని కోరుతున్న వ్యక్తి లేక వ్యక్తులు తమను తాము కష్టపెట్టుకుంటూ ఎదుటివారిలో పరివర్తన తేవటం దీని లక్ష్యం. మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టుల కింద ముంపుకు గురిఅవుతున్న ఖాండ్వా, హర్దా జిల్లాల ప్రజలు సత్యాగ్రహానికి సరికొత్త కోణాన్నిచ్చారు. అది జలసత్యాగ్రహం. ప్రజల కోర్కె సాధారణమైంది. ప్రాజెక్టు ముంపుకుగురైన ప్రజలు సరైన పునరావా సం, పరిహారాన్ని కోరుతున్నారు. ఆనకట్టల ఎత్తును కొంత తగ్గించి ముంపును తగ్గించాలంటున్నారు. చిట్టచివరకు మధ్యప్రదేశ్ ప్రబుత్వం 17 రోజుల జల సత్యాగ్రహం తరువాత వారికోరిక నెరవేరుస్తామని హామీ ఇచ్చింది. జల సత్యాగ్రహం ముగిసింది.


1 comment:

  1. sabhaash mitrulaara sahabhaash
    udyamaalake kotha rupu nichina mee jala sathaagrahaniki jejelu.
    sudarsan, editor, praja patrika, rajahmundry

    ReplyDelete