Thursday, September 20, 2012

ఆఫ్రికా పునరుద్ధరణ స్మారక చిహ్నం : దివ్యమైన గుఱుతా లేక మూర్ఖత్వ పనా?....ఫోటోలు

సెనెగల్ (Senegal) అధికారిక నామం: రిపబ్లిక్ ఆఫ్ సెనెగల్, పశ్చిమ ఆఫ్రికా లోని ఒక దేశం. దీని విస్తీర్ణం 197,000 చ.కి.మీ. మరియు జనాభా 11,700,000. దీని రాజధాని డకార్ నగరం. ఈ నగరంలో 150 మీటర్ల ఎత్తుకు ఒక కంచు విగ్రహాన్ని( ఇప్పుడు ఏ నగరాలల్లోనూ ఇంతు ఎత్తుకు స్మారక చిహ్నం పెట్టడంలేదు) ఆఫ్రికాలో దారిద్ర్యం నిర్మూలిస్తానని దానికి గుర్తుగా ఈ స్మారక చిహ్నం నిర్మించేనని ఆ నాటి సెనెగల్ ప్రెశిడెంట్ President Abdoulaye Wade ప్రజలకు తెలిపేరు. అయితే ఆయన 2010 లో జరిగిన ఎన్నికలలో ఓడిపోయేరు. దానికి ఎన్నో కారణాలున్నా ఇది ముఖ్యమైన కారణమైయ్యింది.ఆ కంచు విగ్రహం తయారుచేయడానికీ, నిర్మించడానికీ సుమారు 40 మిల్లియన్ అమెరికన్ డాలర్లు ఖర్చుపెట్టేరు. ఇదే ఆయనకు ఎదురుగా పనిచేసింది. ఆ కంచు విగ్రహానికి బదులు ఆ 40 మిల్లియన్ల డాలర్లను ప్రజల కోసం కర్చు పెట్టుంటే, సెనెగల్ దేశం ఎంతో అభివ్రుద్దిచెందేది. దారిధ్యంలోనుండి ఆ దేశ ప్రజలు చాలావరకు కోలుకునేవారు. మరి ఈ విషయం ఆయనకెందుకు తెలియలేదో?


3 comments:

  1. కోటీ 17 లక్షలమందిని కేవలం 4 కోట్ల డాలర్లతో ఉద్ధరించగలరా ఎవఱైనా ? అది మన నాణెకంలో సుమారు రు.224 కోట్లు మాత్రమే. అంత మొత్తాన్ని ఆ దేశంలో పిల్లా పాపాతో సహా అందఱికీ పంచినా తలా రు.200 కూడా రావు. ఏంటో ఆ దేశజనాల పిచ్చి ! అనవసరంగా ఓడించారు ఆయన్ని !

    ReplyDelete
  2. 180వేల కోట్ల 2జి స్కాములో మహా వస్తే తలకు 2000రూ. దారిద్రాన్ని నిర్మూలించలేమని తెలిసే రాజా, కనిమొళి, కరుణానిధి, చిదంబరం, కరుణానిధి, మారన్లు బొక్కేశారు.
    1,067,303 కోట్ల స్కాములో కూడా 120కోట్ల జనాలకు పంచితే తలకు వచ్చేది 10వేలలోపే. అందుకే సోణెమ్మ, సింగన్న, మంత్రులు పంచేసుకున్నారు.
    కనీసం ఒక్కో దరిద్రుడిని కోటితో వుద్దరించగలిగే దాకా స్కాములు పెంచుతూ పోవాలి, అంత వరకూ వాళ్ళని ప్రశ్నించడం పిచ్చి అనే వాదనతో ఏకీభవిస్తున్నా. :P :)) ఏదో సర్దాపడి ఓ వంద ఏనుగులు, చేతి సంచితో మాయా విగ్రహాలు పెట్టుకుంటే మూసుకు పడిన యుపి వాళ్ళను చూసి సెగల్ ప్రజలు నేర్చుకోవాల్సింది ఎంతైనా వుంది.

    ReplyDelete