Sunday, September 2, 2012

సందేశం కోసం వాడేసిన ప్లాస్టిక్ బాటిల్లతో తయారుచేయబడ్డ అతిపెద్ద చేప విగ్రహాలు....ఫోటోలు

బ్రెజిల్ దేశంలోని రియో డి జనైరో(Rio de Janeiro)లోని బీచ్ లో వాడబడ్డ ప్లాస్టిక్ బాటిల్లతో అతి పెద్ద చేప విగ్రహాలను తయారు చేసి ఉంచేరు. ఈ విగ్రహాల మూలంగా వారు ఒక సందేశాన్ని తెలిపేరు."మీ వైఖరిని మార్చుకోండి" (“recycle your attitude"). ఎవరికో తెలుసా?....యూనైటడ్ నేషన్స్ అధికారులకు మరియూ మీటింగ్ కు వచ్చిన అతిధులకూ.రియో డి జనైరో లో రియో+20 అనే పేరుతో ప్రపంచంలో పెరుగుతున్న జనాభాను లెక్కకుతీసుకుని పేదరికాన్ని ఎలా నిర్మూలించాలో అనే విషయం గురించి చర్చించు కున్నారు. ఈ చర్చలో ఉద్యోగ అవకాశాలూ, విద్యుత్తు, నగరాలా అభివ్రుద్ది, ఆహార కొరత, మంచి నీటి కొరత, సముద్ర నీటి వేడి మరియూ విపత్తులు గురించి చర్చించి ఏమిచేయాలో నిర్ణయాలు తీసుకుంటూ అభివ్రుద్ది చెందిన దేశాలు తమ వంతుగా ఏమిచేయాలో కూడా నిర్ణయించుకున్నారు.

అయితే వారి నిర్ణయాలు సరైనవి కావని, సదస్సుకు వచ్చిన అధికారులలోనూ, ప్రభుత్వాలలోనూ వారి ఆలోచనలలో మార్పు రావాలని “recycle your attitude" అనే సందేశంతో ఈ విగ్రహాలు చేయబడ్డాయి.


2 comments:





  1. కాదేదీ కళకు అనర్హం అనిపిస్తుంది.

    ReplyDelete
  2. hai sir chala bagundi details ivvadam valla inka hpyga undi taq so much

    ReplyDelete