Monday, September 10, 2012

ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ప్రాజక్ట్ లు....ఫోటోలు మరియూ వీడియో

Oresund Bridge (Cost:$6 Billion).....స్వీడన్ మరియూ డెన్మార్క్ దేశాలను కలపడానికి వేసిన రైల్, రోడ్ మరియూ టనల వంతెన.23.5 వెడల్పు, 7,845 మీటర్ల పొడవు.



Large Hadron Collider (Cost: $6 Billion).....ఫిసిక్స్ (physics) కు మూలాధారమైన విషయాన్ని కనుగొనడానికి స్విజర్లాండ్ దేశంలో ఏర్పరచిన ప్రాజెక్ట్.


ITER – Experimental Fusion Reactor (Cost: $6.5 Billion)....ITER - International Thermonuclear Experimental Reactor(magnetic confinement fusion)అనే ఈ అంతర్జాతీయ ప్రాజెక్ట్ ను కరెంటు ఉత్పత్తిచేసే fusion power plants కోసం నిర్మిస్తున్నారు. 2016 లోపు ఇది పూర్తి అయ్యి పనులు మొదలౌతాయనుకుంటున్నారు. చైనా, యూరోపియన్ యూనియన్, ఇండియా,జపాన్, రష్యా, సౌత్ కొరియా మరియూ అమెరికా దేశాలు కలిపికట్టుగా పనిచేస్తున్నారు.


Olkiluoto Nuclear Power Plant(Cost: $7.2 Billion).....ఫిన్లాండ్లో నిర్మాణంలో ఉన్న నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీతో నిర్మాణమౌతున్న ఈ పవర్ ప్లాంట్ ఈ సంవత్సరం చివరికి రెడీ అవుతునందని అంచనా.


Alaska Pipeline (Cost: $8 Billion).....45 ఇంచ్ ల డయామీటర్తో 12,87,961 కిలోమీటర్ల దూరం వరకు అమెరికా దేశంలో వేయబడ్డ ఆయిల్ పైప్ లైన్.


CVN-78 Class Aircraft Carrier (Cost: $8.1 Billion).......అత్యంత ఆధునిక టెక్నాలజీతో అమెరికా వారు నిర్మిస్తున్న యుద్ద నౌక. బహుశ 2015 లో ఈ నౌక రెడీ అవుతుందని అంచనా.

James Bay Project ( Cost: 13.8 billion).....కెనడా దేశంలో నిర్మించిన ఈ హైడ్రో ఎలెక్ట్రిక్ ప్రాజక్ట్ న్యూయార్క్ నగరమంత విస్తీర్ణంలో సహ నదులను కలుపుకుని హైడ్రో ఎలెక్ట్రిక్ ప్రాజెట్లలోనే అత్యంత ఎక్కువ కరెంటు తయారుచేసే ప్రాజెక్ట్.


Three Gorges Dam(Cost: $25 Billion).....చైనాలో ఉన్న ఈ హైడ్రో ఎలెక్ట్రిక్ ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అత్యధిక కరెంట్ ను ఉత్పత్తిచేస్తోంది.


Itaipu Dam (Cost: $27 Billion).......బ్రెజిల్ మరియూ పరాగువే దేశాల సరిహద్దులో రెండు దేశాలూ కలిసి కట్టిన హైడ్రో ఎలెక్ట్రిక్ ప్రాజెక్ట్. ఇందులో నుండి తయారయ్యే కరెంటులో 90 శాతం పరాగువే దేశమే తీసుకుంటోంది.


International Space Station(Cost: $157 Billion).....కెనడా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ,జపాన్, రష్యా మరియూ అమెరికా కలిసి నిర్మించినది.


No comments:

Post a Comment