Saturday, September 1, 2012

బంగారం ధరలు ఆకాశనంటుతున్నందుకు ఇవీ ఒక కారణమేమో?....ఫోటోలు

బంగారం ధర పేరిగిపోతోంది. ఇక సామాన్య మానవునికి/ మధ్య కుటుంభీలకూ ఈ మెటల్ అందుబాటులో ఉండకపోవచ్చు. బంగారం మీద తమ పెట్టుబడులను పెట్టే పెట్టుబడుదారులు కూడా పెట్టుబడులను తగ్గించుకుంటున్నారట. కారణం కొనే వారు తగ్గిపోతున్నారని. బంగారం ఎక్కువగా అమ్ముడయ్యేది ముఖ్యంగా సామాన్య మానవులూ మరియూ మధ్య కుటుంబీకుల వలనేని ఒక అంచనా.

అసలు బంగారం ధరలు ఎందుకు పెరిగిపోతున్నాయో ఖచ్చితంగా ఎవరూ ఊహించలేకపోతున్నారు. బంగారం ఉత్పత్తి తగ్గిపోతున్నదనీ, డాలర్ విలువ తగ్గిపోతున్నదనీ, ప్రపంచ ఆర్థికవ్యవస్థ బాగుండనందువలన పెట్టుబడి దారులు బంగారం ఎక్కువగా కొనుకుంటున్నారని ...ఇలా ఎన్నో కారణాలు చెబుతున్నారు. ఇది ప్రస్తుతం ఎవరికీ, ముఖ్యంగా సామాన్య మానవులకు అర్ధంకాని విషయంగా ఉన్నది.

బంగారంతో, అందులోనూ 24 క్యారెట్ల బంగారంతో ఎలెక్ట్రానిక్ గాడ్జెట్లు తయారుచేయడవలన కూడా బంగారానికి డిమాండ్ ఎక్కువై ఉండవచ్చు. ఈ గాడ్జట్లను బంగారం పై మోజులేని ప్రజలు కూడా కొంటున్నారట.కారణం గాడ్జెట్ మన్నిక ఎక్కువకాలం గా ఉండటం వలనే.

వీడియో గేం గాడ్జెట్

బంగారు బూట్లు

వాక్యూం క్లీనర్

లాప్ టాప్ లూ/ఐ పాడ్ లు

చిన్న చిన్న మొబైల్ ఫోన్లూ/ యూ.ఎస్.బి(USB)

BBQ గ్రిల్ (వంటకు పనికొచ్చే స్టవ్)

2 comments: