Tuesday, September 4, 2012

ఏముంది ఈ 100 సంవత్సరాల సీల్ చేయబడ్డ ప్యాకెట్టులో?....ఫోటోలు

ఈ క్రింది ఫోటోలలో చూపించబడ్డ సీలు వేసిన బ్రౌన్ రంగు ప్యాకట్ 100 సంవత్సరాల క్రితంది. ఈ ప్యాకెట్ కవర్ మీద 26/08/1912 అని రాయబడి ఉండటమే కాకుండా ఈ ప్యాకెట్టును అదే నెల 2012 లోనే తెరిచి చూడాలి అని రాసి ఉన్నది.

ఈ ప్యాకెట్టులో ఏమున్నదో ప్యాకెట్టు పైన రాయలేదు. ఈ ప్యాకెట్టును నార్వేలోని ఘుద్బ్రన్స్దలు అనే మ్యూజియంలో ఉంచేరు. రెండు ప్రపంచ యుద్దాలను దాటి ఉంచబడిన ఈ ప్యాకెట్ 2 సార్లు మాయమయ్యింది. అంటే యుద్ద సమయాలలో ఎటో పారవేయబడింది. చూసిన వారు తిరిగి ఆ ప్యాకెట్టును అప్పుడున్న ప్రభుత్వ అధికారులకు అందజేసేరు. ఎవ్వరూ ఆ ప్యాకెట్టును విప్పి చూసినట్లు ఎటువంటి ఆనవాలూ లేవు. ఈ ప్యాకెట్టు గురించి ఎన్నో వదంతులు ఉన్నాయి. 1912 లో టైటానిక్ ఓడ గల్లంతులో కొన్ని ఖరీదైన డైమండ్లను అప్పటి మేయర్ అందజేసేరని కొందరు జెబుతుంటే మరికొందరూ, మరియూ పత్రికవారు చారిత్రిక పత్రాలూ లేక 1912 లో జరిగిన రాజకీయ రహస్య నిర్ణయాలూ అని చెబుతున్నారు.

ఈ ప్యాకెట్టును మొత్తానికి ఈ సంవత్సరం ఆగస్ట్ నెల 24 న నార్వే దేశ అధికారులు తెరిచేరు. అయితే అందులో ఏమున్నదో తెలిపేరు. అందులో ఉన్నది కొన్ని పత్రాలు. అన్నీ నార్వే భాషలో రాసున్నది. కాబట్టి దానిని ట్రాన్స్ లేట్ చేసి చెప్పడానికి టైము పడుతుందని తెలిపేరు. 100 సంవత్సరాల వరకూ తెరవకూడదన్న అంశమే చాలా మందిలో ఆ ప్యాకెట్టులో ఏమున్నదో, ఆ పత్రాలలో ఏమి రాసున్నదో తెలుసుకోవాలనే ఆశక్తి ఎక్కువైంది. ఆ ప్యాకెట్టులోని పత్రాలలో ఏమి రాసున్నదో నార్వే ప్రబుత్వం ఎప్పుడు బయటపెడుతుందో అప్పుడే ఈ ప్రపంచానికి తెలుస్తుంది.


2 comments:

  1. Replies
    1. చిలమకూరు విజయమోహన్ గారికి,

      Thank you for correcting.

      మీకోసం.

      Delete