Wednesday, August 8, 2012

సంవత్సరానికి ఒకసారి ఒక నిమిషం ఆగిపోయే నగరం....వీడియో

పోలాండ్ రాజధాణి వార్షా లో ప్రతి సంవత్సరం ఆగస్ట్ 1 వ తారీఖున ఒక నిమిషం ఎటువంటి కదలికలూ లేకుండా ఆగిపోతుంది. హిట్లర్ యొక్క అధికారానికి లొంగిపోయిన పోలాండ్ రాజధాణి వార్షా లో 1944 లో జెర్మనీ సిపాయుల మీద తిరుగుబాటు జరిగింది. ఆ తిరుగుబాటులో జర్మనీ మిలటరీని వెళ్ళగొట్టిన తిరుగుబాటు దారులలో సుమారు 2,00,000 మంది ప్రాణాలు విడిచేరు. వారి ని గౌరవించే విధంగా వార్షా లో ప్రతి సంవత్సరం ఆగస్ట్ 1 వ తారీఖున ఒక నిమిషం పాటూ మౌనం వహిస్తారు. ఇది సంవత్సరాల తరబడి వారు తు.చా తప్పకుండా పాటిస్తున్నారు. ఇది ప్రశంసించవలసిన విషయం.

No comments:

Post a Comment