Thursday, August 16, 2012

మనీలా (ఫిలిప్పీన్స్) ను ముంచెత్తిన ఆకస్మిక వరదలు......ఫోటోలు

ఫిలిప్పీన్స్‌ను కుండకోత వర్షాలు అతలాకుతలం చేసేయి. ఎడతెరిపిలేని వర్షాలతో ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. రాజధాని మనీలాలోని అనేక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. కొన్ని ప్రాంతాల్లో మెడ లోతు వరకు నీళ్ళు నిలబడిపోయాయి. వేలాదిమంది ప్రజలు ఇళ్ళను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్ళారు. వారం రోజుల క్రితం వచ్చిన సోలా తుఫాన్‌లో 50 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదం నుంచి ఫిలిప్పీన్స్ ప్రజలు తేరుకోకముందే వారం వ్యవధిలోనే మళ్ళీ వరదలు ముంచుకొచ్చాయి. రాజధాని మనీలాతో పాటు చుట్టుపక్కల ఉన్న పరిసర రాష్ట్రాలను వరద ముంచేసినట్లు జాతీ విపత్తు నివారణ, నిర్వహణా మండలి తెలియజేసింది. పాఠశాలలు, కార్యాలయాలతో పాటు స్టాక్ ఎక్స్ఛేంజ్ కూడా మూతపడింది. నైరుతి రుతుపవనాల కారణంగా వర్షాలు కొనసాగే అవకాశాలు ఉన్నట్లు సూచించేరు.

No comments:

Post a Comment