Wednesday, August 22, 2012

ప్రపంచంలో వాడుకుల ఉన్న ఇవి మొట్టమొదట చైనా ఇన్వెంట్ చేసినవి....ఫోటోలు

ఇప్పుడు ఎవరినడిగినా చైనీస్ ఫుడ్ అంటే ఇష్టమని చెబుతున్నారు. దానికి తగినట్లే చైనీస్ రెస్టారంట్లు మనదేశంలో ఎక్కువైనై. రైస్ మరియూ రైస్ నూడుల్స్ నచ్చనివారు తక్కువగా ఉన్నారనే చెప్పాలి. ఇవన్నీ ఇప్పుడు వచ్చినవి. కానీ ఇంతకు ముందే చైనా ప్రపంచానికి చాలా ఇచ్చింది. చైనీస్ గురించిన విషయాలు చిరిత్రలో చాలా చదివే ఉంటాము. కానీ వారు మొట్టమొదట ఇన్వెంట్ చేసి దానిని ఇప్పుడు ప్రపంచం విరివిగా ఉపయోగిస్తున్న వాటి గురించి తెలుసుకుందాం.

ప్రభుత్వాలు ఇస్తున్న పేపర్ డబ్బు:.......మొదటిసారిగా 7 వ శతాబ్ధములో పేపర్ డబ్బును చైనా ముద్రించింది. దీనికి కారణం అప్పుడున్న డబ్బుగలవారు ఆ రోజుల్లో ఉపయోగించే కాపర్ డబ్బు కాయిన్లను మోయలేకపోయేరు. మొదట్లో ఈ డబ్బునోట్లను ప్రామిసరీ లేక ఫిక్సడ్ డెపాసిట్ నోట్లలాగా పేపర్లమీద రాసేవారు. ఇది బాగా డబ్బున్న వారికిమాత్రమే చెల్లుబడి అవుతుంది. కొన్ని సంవాత్సరాల తరువాత కాపర్ కాయన్స్ కు తట్టుబాటు ఏర్పడింది. దీనితో అందరికీ ఈ పేపర్ డబ్బును అందుబాటులోకి తెచ్చేరు. కానీ రాష్ట్రాల వారిగా వేరు వేరుగా ఒక క్రెడిట్ నోట్ లాగా ఉండేది. 11 వ శతాబ్ధములో చైనా ప్రభుత్వం చైనా దేశం పూర్తిగా ఒకే పేపర్ డబ్బును ప్రకటించింది. దీనికి కారణం వారు కనుగొన్న చెక్కతో ముద్రణ. చెక్కతో డబ్బును ముద్రించి విడుదలచేసేరు.

ప్రింటింగ్:....రెండురకాల ప్రింటింగ్ ను ఇన్వెంట్ చేసింది చైనీసే. చెక్క మీద అక్షరాలు చెక్కి దానికి రంగు పూసి ముద్రించే ప్రింటింగ్ మరియూ చెక్కతో అక్షరాలను తయారుచేసి వాటిని వరుస చేసి ముద్రించే విధం. 11 వ శతాబ్ధములో ఇన్వెంట్ చేయబడ్డ ఇవి 14 వ శతాబ్ధములో కంచు తో అక్షరాలు తాయారుచేసి ముద్రించడం గా మారింది. మొదలుపెట్టేరు.

పేపర్:......సిల్క్ మరియూ వెదురుబద్దల మీద ప్రింటింగ్ నుండి మొదటి పేపర్ పల్ప్ కనుగును దానితో పేపర్ తాయారుచేసేరు.

గన్ పౌడర్:......అనుకోకుండా కనుగొనబడ్డది. 9 వ శతాబ్ధములో దుష్ట శక్తులను తరమటానికి తారా జువ్వలూ, చిచ్చుబుడ్ల లాంటి ఫైర్ వర్క్స్ లో వాడేరు. 14 వ శతాబ్ధములో గన్ పౌడర్ను బాణాలలో వాడేరు. 15 వ శతాబ్ధములో నైట్రోజన్ను ఎక్కువ కలిపి పేలుడు పధార్ధముగా దాని శక్తిని పెంచేరు.

కాంపస్:.....మొట్టమొదటి ఇనుము దిక్సూచి ని 10 వ శతాబ్ధములో కనుగొన్నా దానిని దైవ శక్తికి మాత్రమే ఉపయోగించేరు. 12 వ శతాబ్ధములో మొదటి సారిగా దానిని నావిగేషన్ లో ఉపయోగించేరు.

శవపేటికలు:......చనిపోయిన వారిని పూడ్చిపెట్టే కలాచారాన్ని మొట్టమొదట చహినీయులే మొదలుపెట్టేరు. చనిపోయిన వారికి ఎక్కువగా మర్యాదనివ్వడం వారికి అలవాటు కారణంగా చనిపోయిన వారిని మట్టిలో పూడ్చిపెడితే కొన్ని రోజులకు వారు మట్టిలో కలిసిపోతారని, చెక్కతో శవ పేటికలను తయారుచేసి అందులో మరణించినవారిని ఉంచి ఆ పెట్టెను భూమిలో పూడ్చి, అక్కడ గుర్తుగా ఏదైనా ఉంచి అప్పుడప్పుడు అక్కడకు వెళ్ళి చూసి వస్తూవుండేవారట.

ఫోర్క్ మరియూ చ్చాప్ స్టిక్:.......మొదట్లో ధనవంతుల భోజనాల కోసం ఎముకలతో తయారుచేయబడ్డాయి. తరువాత చైనా ప్రజల తిండి అలవాట్ల వలన వీటిని ఇనుముతో తయారుచేసేరట.

హోలిస్టిక్ హెల్త్:..... అన్నిటికంటే ఆశ్చర్యకరమైనది ఇదే. 13 వ శతాబ్ధములోనే మానవ శరీరములోని హార్మోన్ల గురించి వాటి పనుల గురించి తెలుసుకున్నారు. మొట్టమొదటి ఎండొక్రినాలజిస్ట్ అక్కడే ప్రయోగాలు చేసేరని చెప్పవచ్చు.

రెస్టారెంట్ మెనూ కార్డ్:.......పూర్వ కాలం లోనే చైనాలో రకరకాల ఆహారాలు దొరికేవట. వాటన్నితిని పేరుపేరునా చెప్పలేక కాగితం పై ముద్రించే పద్దతి ఉండటంతో రెస్టారంట్ మెనూ కార్డ్ ముద్రించేరు.

టాయ్ లెట్ పేపర్:.....మొట్టమొదట పేపర్ ఉపయోగం చైనాలో చేయబడింది కాబట్టి వారు టాయ్ లెట్ పేపర్ తయారుచేసి ఉపయోగించుకునేవారు. ఆ రోజు ప్రపంచం మొత్తం కడుక్కోవటానికి నీరు మాత్రమే వాడేవారు.

4 comments:

  1. మల్లీ గుర్తుచేశారు. ఫోటోలు బాగున్నాయి

    ReplyDelete
  2. ప్రింటింగ్ ప్రెస్ ని కనుగొన్నది జోహాన్ గుటెన్ బర్గ్ అనే జర్మనీ దేశస్తుడు అని అనుకుంటారు గాని నిజానికి దానిని కనుగొన్నది చైనా వాళ్ళే . మీరు చెప్పినట్లు వాళ్ళు చెక్కతో మొదటి పద్దతిని కనుగొన్నారు, కాని గుటెన్ బర్గ్ విడి అక్షరాల ప్రెస్ ని కనుగొన్నాడు.

    ReplyDelete