Monday, August 13, 2012

గూగుల్ సంస్థను అభినందించాల్సిందే

ఉద్యోగుల స్వర్గంగా పేరుపొందిన సంస్థ గూగుల్...దీనిని నిరూపించే విధంగా గూగుల్ సంస్థ అమెరికాలో తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు మరో అద్భుతమైన పధకాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై తమ సంస్థలో పనిచేసే ఉద్యోగుల్లో ఎవరైన మరణిస్తే వారు సంపాదించుకుంటున్న సంవత్సర వేతనాన్ని సంవత్సరానికి ఒకేసారి ఆ ఉద్యోగి జీవితభాగస్వామికి అందజేస్తారు. ఆ ఒక సంవత్సరానికేకాదు. పదేళ్ళపాటు అదేవిధంగా అందజేస్తారు. సంస్థలో ఉద్యోగి అనుభవంతో సంబంధం లేకుండా అందరికీ ఈ పధకం వర్తిస్తుంది.


ఇంతేకాకుండా, చనిపోయిన ఉద్యోగి పిల్లలకు 19 సంవత్సరాలు నిండే వరకూ ప్రతినెలా 1000 డాలర్లు(సుమారు 55 వేల రూపాయలు) అందజేస్తారు. ఆ పిల్లలు విధ్యార్ధులైతే 23 ఏళ్ల వరకూ అందజేస్తారు.


ఈ పధకాన్ని ప్రస్తుతం అమెరికాలోని గూగుల్ కార్యాలయాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు వర్తిస్తుంది. త్వరలో ఈ పధకాన్ని భారదేశంలో కూడా ప్రవేశపెడతామని గూగుల్ సంస్థ ప్రతినిధి తెలిపేరు.


ఇప్పటికే గూగుల్ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు లాండ్రీ,డ్రైక్లీనింగ్,వాహన సేవలూ, స్విమ్మింగ్, మసాజ్,భోజనం,వైద్యం లాంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఈ పధకం ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఒక పెద్ద వరం. ఇలాంటి పధకాన్ని అమలుచేయాలంటే డబ్బు ఉంటే మాత్రం చాలదు. మనసు ఉండాలి. తమ సంస్థ అభివ్రుద్దికోసం ఎల్లప్పుడూ పాటుపడే ఉద్యోగులకు తమ వంతు సహాయం చేయాలనుకున్న గూగుల్ యాజమాన్యానికి ఇవే నా అభివందనలు.

3 comments:

  1. ఇకపై తమ సంస్థలో పనిచేసే ఉద్యోగుల్లో ఎవరైన మరణిస్తే వారు సంపాదించుకుంటున్న సంవత్సర వేతనాన్ని సంవత్సరానికి ఒకేసారి ఆ ఉద్యోగి జీవితభాగస్వామికి అందజేస్తారు.
    ------------------------------
    అర్ధ సంవత్సర వేతనాన్ని
    As reported by Forbes, spouses or domestic partners of U.S.-based Google employees who die while under the employ of the company will receive a check for 50 percent of the deceased employee’s salary for 10 years. The surviving spouse or partner also acquires vested stock benefits, and their children receive $1,000 a month until the age of 19; perhaps longer if the child is still a full-time student.

    ReplyDelete
  2. Idi entha varaku possible.
    Anni companylu ila cheyalevu kada...

    ReplyDelete