Sunday, August 26, 2012

సౌత్ సూడాన్ లోని ఎవరూ వెళ్ళలేని వైట్ నైల్ నది ప్రదేశంలోని గ్రామం....ఫోటోలు

నైలు నది ఆఫ్రికాలో ఉత్తర వాహినిగా ప్రవహించే, ప్రపంచం లోకెల్లా అతి పొడవైన నది. .కానీ ఈ మధ్య కాలంలో వెలువడిన కొన్ని పరిశోధనల ఆధారంగాఅమెజాన్ నది పొడవై ఉండవచ్చునని కొద్ది మంది భావిస్తున్నారు.దీని పొడవు 6650 కి.మీ. నైలు నదికి ప్రధానంగా రెండు ఉపనదులున్నాయి. ఒకటి వైట్ నైల్, మరొకటి బ్లూ నైల్. వీటిలో రెండో ఉపనదిలో ఎక్కువ నీరు ప్రవహిస్తుంటుంది. ఎక్కువ భూమిని కూడా సారవంతం చేస్తుంది. కానీ మొదటిది రెండో దాని కన్నా పొడవైనది. అదే వైట్ నైల్. ఈ రెండు నదులూ సూడాన్ రాజధానియైన ఖార్టూమ్ దగ్గర కలుస్తాయి.

నది ఉత్తర భాగం సుడాన్ నుంచి ఈజిప్ట్ వరకు చాలా భాగం ఎడారి గుండా ప్రవహిస్తున్నది. ఈజిప్ట్ దేశం నీటికోసం, ప్రాచీన కాలంనుంచీ ఈ నదిపైనే ఆధారపడి ఉన్నది. ఈజిప్టు జనాభాలో సముద్ర తీర ప్రాంతాల్లో వారిని మినహాయిస్తే మిగతా వారిలో చాలాభాగం ఈ నది పరీవాహక ప్రాంతాల్లోనే నివాసం ఏర్పరుచుకున్నారు. అంతేకాక ప్రాచీన ఈజిప్టుకు చెందిన చారిత్రక ప్రదేశాలన్నీ ఈ నది ఒడ్డునే కనిపిస్తాయి. ఇది మధ్యధరా సముద్రంలోకలిసే చోట పెద్ద డెల్టాను ఏర్పరుస్తుంది. ఈజిప్టును "నైలునదీ ప్రసాదం" అనికూడా అంటారు.నైలు నది ఈజిప్టు వర ప్రసాదం గా చెబుతారు.

సౌత్ సూడాన్ దగ్గర ఈ నది (వైట్ నైలు నది) 1,30,000 చదురపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రవహిస్తుంది. ఇక్కడికి ఎవరూ వెళ్ళలేరు. అయితే ఎండాకాలంలో నీరు తగ్గిపోతుంది. అప్పుడు ఈ నది విస్తీర్ణం 30,000 చదురపు కిలోమీటర్లుగా ఉంటుంది. అప్పుడు అక్కడక్కడా భూమి కనబడుతుంది. అక్కడున్న గ్రామములోని ఇళ్లనే ఈ ఫోటొలలో మీరుచూస్తున్నది.


No comments:

Post a Comment