Sunday, August 26, 2012

భారదేశం గురించిన ఈ నిజాలలో మీకు ఎన్ని తెలుసు.....?

బ్రిటీష్ వారి దాడికి ముందు అంటే 17 వ శతాబ్ధపు ప్రారంభం వరకూ భారతదేశం ప్రపంచంలోని ఎక్కువ ఐశ్వర్యం గల దేశాలలో ఒకటి.

అంకెలను కనుగొన్నది భారతదేశం మరియూ సున్నా (జీరో) కనుగొన్నది మన శాస్త్రవేత్త ఆర్యభట్ట.

భారతదేశం ప్రపంచములోనే 6 వ పెద్ద దేశం మరియూ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం.

ఎక్కువ మసీదులున్న దేశం భారతదేశం. భారతదేశంలో 3,00,000 మసీదులున్నాయి. ముస్లీం ప్రపంచం మొత్తం మీద ఇన్ని మసీదులు లేవు.

ప్రపంచం మొత్తం మీద కంప్యూటర్ సాఫ్ట్ వేర్ ఎగుమతిలో ఇండియా నెంబర్ ఒన్.

1986 ముందు వరకు ఒక్క భారతదేశంలో మాత్రమే డైమండ్లు కనబడేవి.

ప్రపంచంలోనే ఎక్కువ ఉద్యోగస్తులను కలిగి ఉన్నది భారతదేశ రైల్వే.

ప్రపంచంలోనే అత్యధికమైన పోస్ట్ ఆఫీసులు కలిగినది భారతదేశం.1,50,000 పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి.

భారతదేశంలో మిల్లియనర్లు ఒక మిల్లియన్ మంది ఉంటారు. కానీ చాలామంది భారతీయులు కేవలం 2 డాలర్లతోనే రోజు గడుపుతున్నారు. భారతీయ జనాభాలో 35 శాతం దారిద్ర్య రేకకు క్రిందే బ్రతుకుతున్నారు.

సూపర్ కంప్యూటర్లను తయారుచేసే దేశాలలో ఇండియా 3 వ స్థానం(అమెరికా మరియూ జపాన్ మిగిలిన 2 దేశాలు).

సెటిలైట్లను అంతరిక్షంలోకి పంపే దేశాలలో ఇండియా 6 వ స్థానం.

1985 ముందు వరకు ఇండియాలో ప్లాస్టిక్ బ్యాగులు లేవు.

చక్కెర ను మొదట వాడింది భారతదేశం.

2 comments:

  1. అవినీతిలో కూడా మనదే ముందు

    ReplyDelete