Saturday, August 25, 2012

" ది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా"....ఫోటోలు

ఫోటోల మీద క్లిక్ చేసి పెద్దవిగా చూడండి


గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ప్రపంచవ్యాప్తంగా ప్రశిద్దిచెందింది. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా అనేది ఒకటున్నదని బహుశ చాలామందికి తెలిసుండదు. నిజానికి నాకూ తెలీదు. సెర్చ్ లో మామూలుగా టాపిక్కుల కోసం వెతుకుటూంటే ఈ గొప్ప విషయం తెలుసుకున్నాను. వెంటనే మీ అందరితో ఈ " ది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా" గురించిన విషయాలను పంచుకోవాలని నిర్ణయించుకున్నాను.

దీని గోడలు ఎక్కువగా తూర్పుకు చొచ్చుకుపోయినందువలన ఇది ప్రపంచంలోని 2 వ పొడవైన గోడ అయ్యింది. కానీ తెలిసినవారందరూ ఈ గోడ కుంబాల్ గర్(Kumbhalgarh)కోట చుట్టూ ఉండటంతో ఆ కోట పేరు తోనే పిలుస్తారు. కొంతమంది మాత్రమే దీనిని "ది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా" అని పిలుస్తారు. అయినా బయట ప్రపంచంలో ఉన్న కొద్దిమందిని ఈ గోడ దిగ్భ్రమపరచుతోంది.

ఈ గోడ పొడవు 36 కిలోమీటర్లు. ఇంకోమాటలో చెప్పాలంటే భారీ గోడ. ఈ క్రింది ఫోటోలలో కొన్ని ఫోటలను చూసి మీరు తప్పుగా ఇది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గా మీరు తప్పుగా అర్ధం చేసుకునే అవకాశం వుంది. కానీ ఏన్నో శాతాబ్ధాలూ మరియూ ఆచారాలూ వీటిని వేరుచేస్తాయి. 1443 లో అంటే కొలంబస్ అట్లాంటిక్ సముద్రాన్ని దాటుతూ ఈ గోడను కనుగోనడానికి 50 సంవత్సరాల ముందే ఈ గోడను కట్టేరు.

రాజస్తాన్ రాష్ట్రంలో ఆ ప్రాంత మహారాజు రాణా కుంభ ఈ గోడను కట్టడం మొదలుపెట్టేరు. కానీ ఈ గోడను పూర్తిగా కట్టేటప్పటికి 19 వ శతాభ్దం వచ్చింది. అంత వరకు కోటగా పిలువబడే ఈ చోటును ఇప్పుడు మ్యూజియం చేసేరు.

ఈ గోడ లో చాలా చోట్లలో దీపాలు ఉండేవి. రైతులు రాత్రి పగలు పనిచేయడాని వీలుగా. మరియూ ఈ గోడ సుమారు 360 గుడులను బద్రపరిచేదిగా ఉండేది. ఇందులో సుమారు 60 గుడులు హిందూ దేవాలయాలైతే మిగిలినవి జైన్ మరియూ బౌద్ద మతస్తుల గుడులట. ఇప్పటికీ అక్కడ ఈ మతస్తులందరూ కలహాలు లేకుండా కలిసి కట్టుగా ఉంటున్నారట.

ఈ గోడ 2 రాజ్యాలను విడదీసేదట. మేవర్ మరియూ మర్వార్.....ఈ గోడ గురించిన విషయాలు విదేసీయులకు ఇంకా మర్మంగానే ఉంటున్నదట. పూర్తిగా గోడను దాట వద్దని చెబుతున్నారట. ఎక్కితే విపత్తులకు గురౌతారని చెబుతున్నారట.

6 comments:

  1. ఇది ఎక్కడో వ్రాయలెదు ?

    ReplyDelete
    Replies
    1. మాలా కుమార్ గారికి,

      ఇది రాజస్తాన్ రాష్ట్రంలోని కుంబాల్ గర్(Kumbhalgarh)అనే చోట ఉన్నది.

      మీకోసం

      Delete
  2. మొదట ఎక్కడ కట్టి చచ్చారో రాసి మరీ సోది చెబితే బాగుంటుంది. వెధవ సస్పెన్సేమీటో తెలుగు టివి సీరియల్స్ లాగా! :)))) :P

    ReplyDelete
  3. /రాజస్తాన్ రాష్ట్రంలో ఆ ప్రాంత మహారాజు రాణా కుంభ ఈ గోడను కట్టడం మొదలుపెట్టేరు./
    ఏ ప్రాంత? అహా ఏ ప్రాంత అని అడుగుతున్నా అద్దెచ్చా..

    ReplyDelete
    Replies
    1. SNKR గారికి,

      ఇది రాజస్తాన్ రాష్ట్రంలోని కుంబాల్ గర్(Kumbhalgarh)అనే చోట ఉన్నది. ఈ విషయాన్ని టపాలో ప్రత్యేకంగా రాయలేదు కానీ రాజస్తాన్ రాష్ట్రాన్నీ, కుంబాల్ గర్ ను కూడా రాసేను.

      మీకోసం

      Delete
    2. Thanks a lot for the info, Sir.

      Next year, I'll try to visit the magnificent fort of Kumbhalgarh, during my Ahmadabad-Udaipur trip. :)

      Delete