Thursday, August 16, 2012

సూర్య యోగా రహస్యాలు...ఫోటోలు

ఒక విధంగా చెప్పాలంటే సూర్య యోగా అనే దానిని రహస్యంగా ఉంచేరనే చెప్పాలి...జీవులకు/జీవితానికి కావలసిన పూర్తి శక్తి సూర్యుని దగ్గరనుండే దొరుకుతోంది.


మనకి కావలసిన ప్రాణాధారమైన/జీవాధారమైన శక్తి ని సూర్యుని చూసి మన కళ్ళలో నుండే తీసుకోవచ్చు. ఇక వేరుగా మనలో శక్తి పెరగటానికోసం, శక్తిని పెంచుతుందనే ప్రకటనలకతో అమ్మబడే ప్రత్యేక ఆహారాన్ని తీసుకోనక్కరలేదు.


మన(మనుష్యుల)డి.ఎన్.ఏ(DNA)మొత్త సంకేత వివరాలు వెలుతురు యొక్క సంకేత వివరాల అనుగుణంతో ఉంటుంది. సూర్యుని నుండి వెలువడే వెలుతురులోనూ అదే డి.ఎన్.ఏ ల సంకేతాలు ఉన్నాయి.


మన కళ్ళు క్రమేణా సూర్య వెలుతురును చూడటంలో అలవాటుపడుతుంది.


సూర్య కిరణాలను గాని సూర్య రశ్మిని గానీ చూడటానికి మనకు ఎటువంటి ఇబ్బంది ఉండని సమయం ఒకే ఒక సారి వస్తుంది. అది మనం తల్లి కడుపులో ఉన్నప్పుడు. ఇక మిగతా జీవిత కాలంలో అలా ఎప్పుడుపడితే అప్పుడు చూడలేము. సూర్యోదయం అయిన ఒక గంట వరకూ మరియూ సూర్య అస్తమయానికి ఒక గంట ముందు మనం సూర్యుని మన కళ్ళతో చూడవచ్చు. అలా గనుక మనం రోజూ చూడగలిగితే(సూర్య యోగా చేయగలిగితే)మనం మన ఆరోగ్యానికొసం ఎటువంటి ప్రత్యేక శక్తి పానీయాలుగానీ లేక గులికలుగానీ తీసుకోనవసరంలేదు.


1 comment:

  1. సూర్యయోగ (సూర్య నమస్కారాలేనా?) గురించి ఒక్క ముక్క చెప్పకుండా ఏవేవో ఆకర్షణీయమైన ప్రకటనలు చేసేశారు. :)

    ReplyDelete