Thursday, August 30, 2012

33 సంవత్సరాలు ఒక్కడుగా కష్టపడి రాజ భవనం కట్టిన పోస్ట్ మ్యాన్....ఫోటోలు

ఫ్రాన్స్ నగరంలోని, హౌతెరవిస్ అనే చోట ఫెర్డినండ్ చావెల్ అనే పోస్ట్ మాన్ కట్టిన చిన్న రాజభవనం ను చూస్తే సమయం, ప్రయత్నం మరియూ ఆశక్తి ఉంటే మనిషి ఏదైనా చేయవచ్చు అనేది నిరూపణమౌతుంది. ఎందుకంటే కట్టడంలో ఎటువంటి ట్రైనింగ్ లేకుండానే ఒక పొస్ట్ మ్యాన్ కోటలాంటి రాజభవనం కట్టగలిగేడు.

1836 లో పేదరికంలో పుట్టిన చేవల్ తన 13 వ ఏట ఒక బ్యాకరీలో పనికి జేరేడు. 1867 లో పోస్టల్ సర్వీస్ లో పనికి జేరేడు. తన పని మీద వెడుతున్న చేవల్ కు దారిలో ఒక వింత రూపం కలిగిన రాయి దొరికింది. ఆ రాయిని జేబులో వేసుకున్న చేవల్ ప్రతిరోజూ అలాంటి రాళ్లకోసం వెదకడం మొదలుపెట్టేడు. కొన్ని రాళ్ళు దొరకగానే తన రాజభవనాన్ని కట్టడం మొదలుపెట్టేడు. పొద్దునపూట పనికి వెడుతూ రాత్రిపూట దీపం వెలుగులో భవనం కట్టసాగేడు. 20 సంవత్సరాల శ్రమతో భవనం చుట్టూ గోడ మరియూ భవనం తయారయ్యింది. తాను చూసిన కధల పుస్తకాలలో ఉన్న హిందూ గుడి, స్విస్ చర్చ్ ముస్లీం మసీదు మరియూ మరికొన్ని మతాల గుడుల డిజైన్లను చూసి వాటన్నింటినీ తన భవనంలో రూపాలుగా పెట్టాలని మరో 13 సంవత్సరాలు కష్టపడ్డాడు. చివరకు తయారయ్యిందే ఈ చేవల్ రాజభవనం.

తనకు 70 సంవత్సరాల వయస్సులో ఆ భవనం పూర్తి అయ్యింది. కొద్ది రోజులు తన భవనంలో విశ్రాంతి తీసుకున్న చేవల్ 1924 లో చనిపోయేరు. ఆ తరువాత ప్రభుత్వం ఆ భవనాన్ని కైవసం చేసుకుని మెరుగులు దిద్ది దానిని జాగ్రత్త పరిచింది. చేవల్ ను గౌరవించే విధంగా 1986 లో ఫ్రాన్స్ ఒక పోస్టేజ్ స్టాంప్ ముద్రించింది.

ఇప్పుడిది ఒక టూరిస్ట్ స్పాట్. ప్రవేశ రుసుము చెల్లించి చూడాలి.


3 comments:

  1. చాలా బాగుంది పోస్ట్ మాన్ రాజ భవనం. మీ బ్లాగ్ని నేను రోజు చూస్తాను చాలా ఇంట్రెస్టింగా ఉంటై అన్ని అంశాలు చాలా థాంక్స్

    ReplyDelete
  2. మీరు ఇవన్నీ ఎక్కడ సేకరిస్తారో తెలుసుకోవాలని ఉంది

    ReplyDelete
    Replies
    1. Hyma Reddy గారికి

      అంతర్జాలంలో నుండే సేకరిస్తున్నాను.

      మీకోసం.

      Delete