Saturday, August 18, 2012

కనీసం 1000 సంవత్సారాలు పక్కాగా ఉండాలని డిజైన్ చేయబడినవి....ఫోటోలు

ఈ క్రింది ఫోటోలలో మీరుచూస్తున్న వస్తువులన్నీ 1000 సంవత్సరాల వరకూ పాడైపోకుండా ఉండేవి అని వీటిని తయారుచేసిన/చేస్తున్న వారూ, పత్రికలూ తెలియజేస్తున్నాయి. మరి ఇది నిజమో కాదో తెలియదుగానీ వారి ఉద్దేశాలు మాత్రం చాలా గొప్పవిగా ఉన్నాయి. అందువలనైనా ఇవి 1000 సంవత్సరాలవరకూ పాడైపోకుండా, భవిష్యత్ కాల సంతతికి పురాతణ చిహ్నాలుగా ఉండిపోవాలి.

Kalachakra World Peace Stupa:…. ఈ అరుదైన, పవిత్రమైన బౌద్ద మత స్మారక చిహ్నం ఆస్ట్రేలియాలోని క్రిస్టల్ కాసల్ కాంప్లెక్స్ లో కట్టబడుతోంది. ఈ స్తూపాన్ని పురాతణ సూత్రాలతో ఆధునిక టక్నాలజీతో కడుతున్నారు. డాలైలామా ఆశీర్వాదంతో కట్టబడుతున్న ఈ స్తూప మందిరంలోకి ఎటువంటి కష్టాలతో వచ్చినవారికైనా వచ్చిన వారికి ప్రశాంతత లభిస్తుందట. ఎందుకంటే ఈ స్తూప మందిరంలో నెగటివ్ ఎనర్జీని తీసేసి పాసిటివ్ ఎనర్జీ ఇచ్చే టెక్నాలజీ ఉంటుందట. ఈ స్తూపం 2012 లోపల రెడీ అవుతుందట.

Prince William’s Tribute To Diana:….. 2008 లో ప్రిన్స్ విల్లియంస్ ను బ్రిటీష్ పురాతణ రాజ కుటుంభంలో 1000 వ శూరుడుగా ప్రకటించి పట్టాభిషేకం చేసేరు. దానికి గుర్తుగా 24 కేరట్ల బంగారంతో ఎర్రటి వైడూర్యాలు పొదిగిన కిరీటం తయారుచేసేరు. 1000 సంవత్సారల వరకూ పాడైపోకుండా ఉండేటట్లు తయారుచేయబడ్డ ఆ కిరీటంపై తన తల్లి ప్రిన్స్ డైయానా కుటుంభ గుర్తును వేయించాలని పట్టుబట్టి వేయించేరు ప్రిన్స్ విల్లియంస్.

Art To Last A Millennium:….. బుయల్ ముల్లన్ (1901-1986)అంతర్జాజాతీయంగా పేరుపొందిన కళాకారిణి. ఎందుకంటే ఆర్ట్ లో ఈమె కొత్త పద్దతిని కనుగొన్నది. స్టైన్ లెస్ స్టీల్, మెటల్స్, ఆల్యూమినియం, గోల్డ్, కాపర్, క్రోమియం మరియూ నికెల్ షీట్లపై ఆసిడ్ లు ఉపయోగించి పెయింటింగ్ వేసేది. ఈ పెయింటింగ్ ఎన్ని సంవత్సరాలైన పాడైపోదుట. మీరు చూస్తున్న ఈ క్రింది ఫోటో ఆమె President Dwight Eisenhower, presented to the Seventh Regiment Armory of New York City, బహుమతిగా స్టైన్ లెస్ స్టీల్ పై వేసిందట.

Antique Bibles:…… ఈ బైబుల్స్ ఎందుకు ఎన్నో సంవత్సరాలుగా పాడైపోకుండా ఉన్నదో మీకు తెలుసా?...కారణం, ఇవి ట్రీటడ్ జంతు చర్మాలపై ముద్రించబడినవిట లేక ఆసిడ్ లేని గుడ్డ మీద ముద్రించబడినవిగా చెబుతారు. ఇవి ఎన్ని సంవత్సరాలైన పాడైపోవట.

St. Louis Gateway Arch:….. అమెరికాలోలోని సైంట్ లూయిస్ లో ఉన్న ఈ 630 అడుగుల ఎత్తున్న ఆర్చ్ అమెరికా యొక్క పడమటి విస్తరణ ను సూచించడానికి గుర్తుగా 1965లో కట్టబడింది. స్టైన్ లెస్ స్టీల్ తో కట్టబడిన ఈ ఆర్చ్ ను సక్రమముగా సంరక్షరిస్తే 1000 సంవత్సరాల వరకు పాడైపోదట.

Iznik Tiles:……. ఉజ్వలమైన రంగుల టైల్స్ 15 మరియూ 16 వ శతాబ్ధములలో తయారుచేయబడినవి. ఈ టైల్స్ ఇప్పటికీ ప్రపంచ్ములోని కొన్ని మసీదులలో ఉన్నాయట. అవి ఈ రోజుకూ కొత్తవిలాగానే తళతళా మెరుస్తూనే ఉన్నాయట. ఇప్పటికే 500 సంవత్సరాలు పాడైపోకుండా ఉన్న ఈ టైల్స్ ఇంకో 500 సంవత్సరాలవరకూ అలాగే ఉండగలవని నిపుణులు చెబుతున్నారు.

Longplayer:...1995-1999 మధ్య జెన్ ఫైనర్ అనే మ్యూజీషియన్ చే కంపొస్ చేసి డెవెలప్ చేయబడిన ఈ లాంగ్ ప్లేయర్ 1000 సంవత్సరాల వరకు విడువకుండా సంగీతాన్ని అందించే మ్యూజికల్ పీస్ గా తయారుచేయబడినది. ఇది లండన్లోని Trinity Buoy Wharf లో ఉన్నది.

“Permanent” Paper – Nuclear Legacy:……1940 నుండి మానవజాతి న్యూక్లియర్ వేస్ట్ ను భూమి మీద బద్రపరుస్తున్నారు. అందులోనుండి వెలువడే రేడియో ఆక్టివ్ భూమిపై యున్న ప్రాణకోటికి ప్రమాదమని తెలుసుకుని ఇప్పుడు భూగర్భంలో ఉంచుతున్నారు. అది కూడా ప్రమదమేనని భవిష్యత్ వారసలకు తెలియచెప్పడానికి కెమికల్ పల్ప్ తో పేపరును తయారుచేసి దానిని ఒక పుస్తకరూపంలో ముద్రించేరు. ఈ కెమికల్ పల్ప్ పేపర్ 1000 సంవత్సరాలైన పాడైపోదట.

Monolithic Dome Houses (MDH):.....ఎటువంటి ప్రక్రుతి వైపరీత్యాన్నైనా తట్టుకోగల శక్తి కలిగిన ఈ మోనోలెతిక్ డోం ఇళ్ళు ఇప్పుడు చాలాచోట్ల కట్టబడుతున్నాయి. ఈ ఇళ్ళు 1000 సంవత్సరాల వరకు పాడైపోదని తెలుపుతున్నారు.

M-Disc, The Archival Disc With A Thousand-Year Lifespan:.....ఎం. డిస్క్ మరియూ ఎం.రైటర్ను అమెరికాలోని మెల్లియినియాటా అనే కంపెనీ తయారుచేస్తోంది. ఈ డిస్క్ లో రాయబడిన ఏ చిత్రానినైనా లేక ఏ లిపినైనా 1000 సంవత్సరాల తరువాత కూడా చూడవచ్చుట. అంటే వారు తయారుచేస్తున్న ఈ డిస్క్ 1000 సంవత్సరాలైనా పాడైపోదట.

No comments:

Post a Comment