Friday, August 31, 2012

జపానీయుల ఆహారం: ప్రాణమున్న కప్ప షుషీ...వీడియో(సున్నితమైన మనసున్నవారు దయచేసి చూడవద్దు)

బ్రతికున్న ఫ్రాణినిని తినడం, ఆ ప్రాణి అనుభవిస్తున్న నొప్పి ని చూస్తూ సంతోషంగా తినడం క్రూరమైనది మరియూ అమానుషం.

చుట్టూ నీరున్న అద్భుతమైన కోటలు...ఫోటోలు

Červená Lhota Castle, Czech Republic

Schloss Nordkirchen, Germany

Moritzburg Castle, Germany

Vischering Castle, Germany

Trakai Island Castle, Lithuania

Leeds Castle, UK

chwerin Castle, Germany

Herstmonceux Castle, UK

Muiderslot, Netherlands

Moyland Castle, Germany

Thursday, August 30, 2012

33 సంవత్సరాలు ఒక్కడుగా కష్టపడి రాజ భవనం కట్టిన పోస్ట్ మ్యాన్....ఫోటోలు

ఫ్రాన్స్ నగరంలోని, హౌతెరవిస్ అనే చోట ఫెర్డినండ్ చావెల్ అనే పోస్ట్ మాన్ కట్టిన చిన్న రాజభవనం ను చూస్తే సమయం, ప్రయత్నం మరియూ ఆశక్తి ఉంటే మనిషి ఏదైనా చేయవచ్చు అనేది నిరూపణమౌతుంది. ఎందుకంటే కట్టడంలో ఎటువంటి ట్రైనింగ్ లేకుండానే ఒక పొస్ట్ మ్యాన్ కోటలాంటి రాజభవనం కట్టగలిగేడు.

1836 లో పేదరికంలో పుట్టిన చేవల్ తన 13 వ ఏట ఒక బ్యాకరీలో పనికి జేరేడు. 1867 లో పోస్టల్ సర్వీస్ లో పనికి జేరేడు. తన పని మీద వెడుతున్న చేవల్ కు దారిలో ఒక వింత రూపం కలిగిన రాయి దొరికింది. ఆ రాయిని జేబులో వేసుకున్న చేవల్ ప్రతిరోజూ అలాంటి రాళ్లకోసం వెదకడం మొదలుపెట్టేడు. కొన్ని రాళ్ళు దొరకగానే తన రాజభవనాన్ని కట్టడం మొదలుపెట్టేడు. పొద్దునపూట పనికి వెడుతూ రాత్రిపూట దీపం వెలుగులో భవనం కట్టసాగేడు. 20 సంవత్సరాల శ్రమతో భవనం చుట్టూ గోడ మరియూ భవనం తయారయ్యింది. తాను చూసిన కధల పుస్తకాలలో ఉన్న హిందూ గుడి, స్విస్ చర్చ్ ముస్లీం మసీదు మరియూ మరికొన్ని మతాల గుడుల డిజైన్లను చూసి వాటన్నింటినీ తన భవనంలో రూపాలుగా పెట్టాలని మరో 13 సంవత్సరాలు కష్టపడ్డాడు. చివరకు తయారయ్యిందే ఈ చేవల్ రాజభవనం.

తనకు 70 సంవత్సరాల వయస్సులో ఆ భవనం పూర్తి అయ్యింది. కొద్ది రోజులు తన భవనంలో విశ్రాంతి తీసుకున్న చేవల్ 1924 లో చనిపోయేరు. ఆ తరువాత ప్రభుత్వం ఆ భవనాన్ని కైవసం చేసుకుని మెరుగులు దిద్ది దానిని జాగ్రత్త పరిచింది. చేవల్ ను గౌరవించే విధంగా 1986 లో ఫ్రాన్స్ ఒక పోస్టేజ్ స్టాంప్ ముద్రించింది.

ఇప్పుడిది ఒక టూరిస్ట్ స్పాట్. ప్రవేశ రుసుము చెల్లించి చూడాలి.


జెకస్లోవేకియాలో చిన్న చర్చ్ క్రింద ఉన్న ఎముకల నిలయం....ఫోటోలు

ఎముకల నిలయం ( ఆంగ్లంలో Ossuary)నిర్మించటానికి ముఖ్యకారణం, చనిపోయిన వారిని శాశ్వతంగా పూడ్చిపెట్టటానికి చోటులేక లేకపోవటంవలన, చనిపోయిన వారిని కొద్దిరోజులు పూడ్చిపెట్టి తరువాత బయటకు తీసి వారి శరీరంలోని ఎముకలను వేరుచేసి ఒక చోట బద్రపరుస్తారు. ఇలా చేయడం 1870 కి ముందునుండే జరిగినా 1870లో ఎముకలను క్రమపరిచి, వాటి పవిత్రతను కాపాడటానికి ఏర్పాట్లు చేసేరు. భూమి క్రింద ఏర్పాటుచేయడంవలన పైన ఒక చిన్న రోమన్ కాతలిక్ చర్చ్ కట్టేరు. సెడ్లెక్ అనే చోట ఉన్న ఈ ఎముకల నిలయాన్ని చూడటానికి సుమారు 2 లక్షల మంది టూరిస్టులు వస్తారట. దీనిని చూడటానికి వచేవారు అక్కడ నిర్ణయించిన సమయాలలోనే రావాలి. లోపలకు వెళ్ళడానికి డబ్బు కట్టాలి. డిసంబర్ నెల 24 మరియూ 25 న అనుమతిలేదట.


అంతరిక్ష నడక....ఫోటోలు

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) వెలుపల డిస్కవరీ వ్యోమ నౌకకు చెందిన ఇద్దరు వ్యోమగాములు నడక సాగించారు. రెండుసార్లు వీరు అంతరిక్షంలో నడక సాగించిన విషయం తెలిసిందే. అమెరికా వ్యోమగామి జాన్ డేనీ ఓలివస్, స్వీడే క్రిస్టర్ ఫగుల్‌సంగ్ నిర్ణీత ఆరున్నర గంటల అంతరిక్ష నడకను ప్రారంభించారు. అంతరిక్ష కేంద్రం వెలుపల విడిభాగాలను వినియోగానికి వీలుగా అమర్చడం, కేంద్రం ఉనికిని ఎప్పటికప్పుడు భూమికి తెలియ జేసేందుకు ఉద్దేశించిన ఉపకరణాన్ని అమర్చడం వీరి భాధ్యత. నిర్ణీత గడువులో ఆరు గంటల నడకను పూర్తి చేశారు.

ఇండో అమెరికన్ మహిళా వ్యోమగామి సునీతా విలియమ్స్ కూడా అంతరిక్షంలో రెండుసార్లు రోదసీ నడక చేశారు.