Friday, July 13, 2012

FORTUNE 500 కంటే డబ్బుగల భారత గుడులు....ఫోటోలు

Vaishno Devi Temple......సంవత్సర ఆదాయం సుమారు 500 కోట్ల రూపాయలు.

Golden Temple......పేరులోనే తెలుస్తుంది ఈ ఆలయ స్థిరాస్తి విలువ. ఆ పై సంవత్సర ఆదాయం.

Siddhivinayak Temple......ఈ గుడియొక్క గోపురం 3.7 కిలోల బంగారంతో చేయబడింది. సంవత్సర ఆదాయం సుమారు 50 కోట్ల రూపాయలు. బ్యాంకులో ఉన్న ఫిక్సడ్ డెపాజిట్ విలువ సుమారు 125 కోట్ల రూపాయలు.

Shirdi Saibaba Temple.......వెండి మరియూ బంగారు ఆభరణాల విలువ సుమారు 32 కోట్ల రూపాయలు. ఈ గుడికి సంవత్సరానికి వచ్చే విరాళం సుమారు 350 కోట్ల రూపాయలు.

Tirupati Balaji Temple......రోజుకు 60,000 భక్తులు దర్శనం చేసుకునే ఈ స్వామివారికి సంవత్సరానికి వచ్చే విరాళం సుమారు 650 కోట్ల రూపాయలు. స్వామివారి బంగారు ఆభరణాల తూకం 1000 కిలోలు.

Padmanabhaswamy Temple......ఈ గుడిలో 6 రహస్య అరలు ఉన్నాయి. అందులోని 4 అరలలో పత్రాలూ మరియూ కొంత విలువగల వస్తువులు ఉన్నాయి. 5 మరియూ 6 వ అరలలో 5 వ అర మాత్రమే తెరిచి చూసేరు. అందులో ఉన్న ఆభరణాల విలువ సుమారు 20 బిల్లియన్ డాలర్ల దాకా ఉంటుందట. ఇంకా 6 వ అర లో ఏమున్నదో వేచి చూడాలి.

2 comments: