Monday, July 16, 2012

“Ebay” లో విచిత్రమైన వేలం పాటలు....ఫోటోలు

Lotus Esprit Turbo Sports Car.........ఈ స్పోర్ట్స్ కారును కేవలం 50 పెన్నీలకు వేలం పాట పెట్టేరు. దీని అసలు ఖరీదు రూ.17,50,000/-.

Captain Kirk’s Charitable Kidney Stone.....స్టార్ ట్రెక్ సినిమాలో నటించిన విల్లియం షట్నర్ కిడ్నీ స్టోన్ వలన భాధ పడుతున్నప్పుడు ఆపరేషన్ చేసి ఆ కిడ్నీ స్టోన్ ను తీసేరు. అలా తీసిన కిడ్నీ స్టోన్ ను రూ.40 లక్షల కు వేలం పాటలో పెట్టేరు. వచ్చే డబ్బును చారిటీకి ఇస్తున్నట్లు ప్రకటించేరు.

The Chance To Spend Eternity On Top Of Marilyn Monroe.......శ్మశానం లో మార్లిన్ మాన్రో ను పూడ్చిపెట్టిన చోటు పక్కన ఎల్సీ పోంచర్ అనే ఆవిడ యొక్క భర్తను పూడ్చిపెట్టేరు. భర్త చనిపోయిన తరువత అప్పుల బారి పడిన ఆమె తన భర్త శవాన్ని (మిగిలి యున్న ఎముకల భాగాలను) వెలికి తీసి ఆ చోటును వేలం పాటకు పెట్టింది. చనిపోయిన తరువత అయినా మార్లిన్ మాన్రో పక్కన ఉండాలని ఆ చోటును 253 మిల్లియన్ రూపాయలకు కొనుకున్నారు. ఎవరు కొనుకున్నారో మాత్రం బయటపెట్టలేదు.

A Large (And Genuine) Piece Of The Planet Mars......అంగారక గ్రహం యొక్క ముక్క....1962 లో సెంట్రల్ నైజీరియాలో 18,000 గ్రాముల బరువున్న ఉల్క పడింది. ఆ ఉల్క 1.3 బిల్లియన్ సంవత్సరాల వయసున్న అంగారక గ్రహం యుక్క ముక్క అని భూగోళ శాస్త్రవేత్తలు తెలిపేరు. ఆ ఉల్క ఒక ప్రైవేట్ స్థలంలో పడింది కనుక ఆ ముక్క ఆ స్థలం యజమాని ఉంచుకున్నాడు. ఆ యజమాని ఆ అంగారక ఉల్కను రూ.2 కోట్ల 50 లక్షలకు వేలం పాటలో ఉంచితే అంతకంటే ఎక్కువ డబ్బే వచ్చిందట.

Old Pair Of Jeans.....పాత జీన్స్ ప్యాంటు.... 1880 లకు చెందిన జీన్స్ ప్యాంట్. 2001 లో వేలం పాటలో పెట్టిన ఈ జీన్స్ ప్యాంటును రూ.25 లక్షలకు వేలం పాట పెడితే ఆ రోజే దానిని కొనేసేరు. కొన్నది ఎవరంటే 1873 లో జీన్స్ ప్యాంటులు తయారుచేయడం మొదలుపెట్టిన స్టూరస్ కంపెనీవారే.

Max, The 50,000-Year-Old Woolly Mammoth.......50,000 సంవత్సరాల క్రితం చనిపోయిన వులన్ ఏనుగు ను యొక్క ఎముకల గూడును ఆ ఏనుగు యొక్క యజమాని 2004 లో వేలం పాటలో పెట్టేడు. అప్పుడుయ్ ఆ ఏనుగు బొమికలపై ఎటువంటి వులన్ లేదు. కాని ఆ ఎముకల గూడును 50 లక్షల రూపాయలకు ఒక వ్యాపారవేత్త కొనుకున్నారు. ఎందుకు కొనుకున్నారో ఆరా తీస్తే ఆ ఏనుగు యొక్క డ్ణా తీసుకుని అలాంటి ఏనుగులను క్లోనింగ్ చేయడానికని తెలిసింది.

One Russian Prototype Space Shuttle, Used Condition.......రష్యా వారి స్పేస్ షటుల్ బురాన్......2002 లో దీనిని వేలం పాటలో పెడితే దీనిని 50 లక్షల రూపాయలకు కొనుకున్నారు. ఎవరు కొనుకున్నారో మాత్రం తెలుపలేదు.

No comments:

Post a Comment