Thursday, July 12, 2012

అంతర్జాతీయంగా "పిల్లలను ఎత్తుకునే వారం"...ఫోటోలు

"పిల్లలను అసలు ఎత్తుకోకూడదూ...వారిని బేబీ చైర్లలోనే ఉంచి తీసుకువెళ్ళాలి" అనే మాట చాలా కాలంగా వెస్ట్రన్ దేశాలలో ప్రచారం చేస్తూ వచ్చేరు. దీనిని కొన్నిదేశాలలో కొంతమంది పాటిస్తూ వచ్చేరు. కానీ కొంతకాలానికి అక్కడుంటున్న తల్లితండ్రులలో మార్పు వచ్చింది. పిల్లలను ఎత్తుకుంటేనే ఆనందమున్నదని చెప్పటం మొదలుపెట్టటమే కాకుండా ఎత్తుకోవటం మొదలు పెట్టేరు. కొద్దికొద్దిగా ఈ మార్పు చాలాదేశాలలో వచ్చింది. "పిల్లలను ఎత్తుకోవడమే తల్లితండ్రులకు ఆనందం" అనే మాటను ప్రచారం చేయడానికి అంతర్జాతీయ పిల్లలను ఎత్తుకునే వారం గా సాంవత్సరంలో ఒక వారాన్ని ప్రకటించేరు. కొన్ని దేశాలు వారి దేశ సెలవు దినాలకు అనుగుణంగా వారాన్నీ మార్చుకున్నారు. ఈ వారాన్ని ఒక పండుగగా జరుపుకుంటూ పిల్లలను ఎత్తుకోవడం లో జాగ్రత్తలు చూపాలని ప్రచారం కూడా చేస్తున్నారు.


No comments:

Post a Comment