Tuesday, July 31, 2012

ఒక సారి రైల్వే మంత్రులనూ, అధికారులను శిక్చించండి...రైలు ప్రమాదాలు ఖచ్చితంగా తగ్గిపోతాయి


రైలు ప్రమాదం జరిగినప్పుడల్లా ప్రయాణీకుల బద్రతను కాపాడవలసిన రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే అధికారులూ ప్రమాదానికి డొంక తిరుగుడు కారణాలు వెతికి మరీ చెబుతారు. కారణాలు ఏవైన ఆ కారణాలు చోటుచేసుకోవడానికి కారణకర్తలు వారేనని ఒప్పుకోరు. నిన్న నెల్లూరు దగ్గర జరిగిన తమిళనాడు ఎక్స్ ప్రెస్స్ S11 కోచ్ ప్రమాదానికి భాద్యత నాదికాదనీ కాబట్టి నేను రాజీనామా చేయవలసిన ప్రశ్నకు తావేలేదని రైల్వే మంత్రి ముకుల్ రాయ్ తెలిపేరు. నిజమే ఎంతో కష్టపడి, మమతా బెనర్జీ ప్రధానమంత్రితో గొడవపడి, బెదిరించి ఈయనకు ఆ పదవి ఇప్పిస్తే అప్పుడే ఆ పదవి వదులుకుంటే ఎలా?....ఇదండీ మన భారత రైల్వే మంత్రిత్వ శాఖ పనిజరుపుతున్న విధానం.

భారతీయ రైళ్ళు మృత్యు శకటాలుగా మారాయి. ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ ఉన్న భారతీయ రైల్వేలలో భద్రత శుష్క వాగ్దానంగా, కంటి తుడుపు మాటగా మాత్రమే మిగిలిపోవడం విచారకరం. ప్రయాణీకుల భద్రత కోసం ప్రతి బడ్జెట్లో వేల కోట్ల రూపాయలు కేటాయించినదంతా ఏమైపోతోంది. అత్యాధునిక రక్షణ వ్యవస్థలను ప్రవేశపెట్టడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు? రైలు ప్రమాదాల్లో 42 శాతం(ఈ శాతం ఇప్పటికీ ఇంకా ఎక్కువగా పెరిగే ఉంటుంది) రైల్వే సిబ్బంది వైఫల్యం వల్లనే సంభవిస్తున్నాయని అనిల్ కకోద్కర్ కమిటీ నిగ్గు తేల్చింది. అయితే ప్రమాదం సంభవించిన ప్రతిసారీ విద్రోహ చర్యగా రైల్వే అధికారులు ప్రకటిస్తుంటారు. షార్ట్ సర్క్యూట్ వంటి ప్రమాదాలు జరిగినా పసిగట్టగలిగే ఫైర్ డిటెక్షన్ విధానాన్ని అమలు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదన ఇప్పటికీ కాగితాలకే పరిమితమైంది. 2009 మార్చి-సెప్టెంబర్ మధ్యకాలంలో 14 రైళ్ళలో జరిగిన అగ్ని ప్రమాదాల్లో ఆరు ఎలక్ట్రికల్ షాట్ సర్క్యూట్స్ వల్లే జరిగాయని తేలింది.


ఏడాది వ్యవధిలో ఈ తరహా దుర్ఘటన జరగడం ఇది నాలుగోసారి. ఇంతక్రితం గత ఏడాది ఏప్రిల్లో మధ్యప్రదేశ్లో ముంబై-ఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్లోని మూడు బోగీలు తగలబడ్డాయి. అదే ఏడాది జూలైలో న్యూఢిల్లీ-పాట్నా రాజధాని ఎక్స్ప్రెస్ జనరేటర్ కోచ్ ఢిల్లీ దగ్గర్లో తగలబడింది. ఈ రెండు ప్రమాదాల్లోనూ అదృష్టవశాత్తూ ప్రాణనష్టం జరగలేదు. ఆ తర్వాత నవంబర్లో హౌరా-డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్కు మంటలంటుకుని ఏడుగురు సజీవదహనమయ్యారు. ప్రతి దుర్ఘటనా మాకు గుణపాఠమేనని ఓసారి అప్పటి రైల్వే శాఖ సహాయ మంత్రి దినేశ్ త్రివేదీ వాక్రుచ్చారు. ఇకపై ఇలాంటివి పునరావృతం కానీయబోమని కూడా ఆయనన్నారు. ఆయనే కాదు... రైల్వే శాఖను చూసే ప్రతి మంత్రి నోటా ఇలాంటి ఆణిముత్యాలు వెలువడుతూనే ఉంటాయి. ఎలాంటి అగ్ని ప్రమాదాలనైనా తట్టుకునేలా, మంటలు విస్తరించకుండా ఉండేలా కోచ్లను నిర్మిస్తామని, షార్ట్ సర్క్యూట్లాంటిది సంభవించకుండా బహుళ అంచెల విద్యుత్ రక్షణ వ్యవస్థను అమరుస్తామని చాన్నాళ్లక్రితం బడ్జెట్ ప్రసంగంలో కూడా చెప్పారు. ఇవన్నీ అమలై ఉంటే తమిళనాడు ఎక్స్ప్రెస్లో ఈ విషాదం సంభవించేదికాదు.

తమిళనాడు ఎక్స్ప్రెస్లో లోని S11 కోచ్ ప్రయాణానికి పనికిరాదని 3 నెలల క్రిందే గుర్తించేరట. ఈ కోచ్ లో ఎలెక్ట్రికల్ ప్రాబ్లం ఉన్నదని తెలిపేరట. దానికి మరమత్తులు చేసి ప్రయాణాలకు ఉపయోగించేరట. ఈ సంవత్సరం మే నెల మళ్ళీ ఈ కోచ్ మరమత్తులకు వెళ్ళింది. మళ్ళి మరమత్తులు చేసి వాడుకున్నారు. 2 లేక 3 సార్లు ఒకే ప్రాబ్లం తో మరమత్తులకు వెళ్ళిన కోచ్ ను డిస్ మాంటల్ చేయకుండా ఏవో మరమత్తులు చేసి వాడటం ఈ రోజు అది 50 మంది ప్రాణాలు తీయడమే కాకుండా ఆ కోచ్ లో ప్రయాణం చేసిన అందరికీ భాదలనే మిగిల్చింది.

దీనికి ఎవరు కారణం? రైల్వే మంత్రిత్వ శాఖ మరియూ సంబంధించిన రైల్వే అధికారులూ.....కాబట్టి ఈ 50 మంది సజీవదహనానికి రైల్వే మంత్రి, మంత్రిత్వ శాఖ మరియూ సంభందిత రైల్వే అధికారులే కారణం... వారిని శిక్చించండి...జైళ్లకు పంపండి

9 comments:

 1. >నిన్న నెల్లూరు దగ్గర జరిగిన తమిళనాడు ఎక్స్ ప్రెస్స్ S11 కోచ్ ప్రమాదానికి భాద్యత నాదికాదనీ కాబట్టి నేను రాజీనామా చేయవలసిన ప్రశ్నకు తావేలేదని రైల్వే మంత్రి ముకుల్ రాయ్ తెలిపేరు.

  మనకు లోగడ స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే మంత్రిగా పని చేసారని గుర్తుంది కదా. ఆయన ఒక రైల్వే ప్రమాదానికి బాధ్యత వహించి మంత్రిపదవికి రాజీనామా చేసారు. ('జనం యీయనను యెందుకు పొగడుతున్నారో తెలియటం లేదని' ఇందిరాగాంధీ విసుక్కుందని కూడా మనం మరచి పోలేదు).

  ప్రస్తుత రైల్వే మంత్రి ముకుల్ రాయ్ పాటి లోకజ్ఞానం పాపం శాస్త్రిగారికి లేదు!

  ReplyDelete
 2. >2 లేక 3 సార్లు ఒకే ప్రాబ్లం తో మరమత్తులకు వెళ్ళిన కోచ్ ను డిస్ మాంటల్ చేయకుండా ఏవో మరమత్తులు చేసి వాడటం ...
  ఎందుకు వాడరండీ. సాక్షాత్తు ముఖ్యమంత్రుల ప్రయాణానికే పాత హెలికాప్తర్లు వాడే మన దేశంలో, ప్రజలకు తుక్కు బోగీలు కాక మరేమిస్తారు నిత్యప్రయాణాలకి?

  ReplyDelete
 3. our govt,people never change...

  ReplyDelete
 4. వాళ్ళే కావాలని చేసివుంటే తప్ప అధికారులను, మంత్రులను ఇలాంటి ప్రమాదాలకు ప్రత్యక్ష కారకులుగా చేసి జైలుకు పంపడం సమర్థనీయం కాదు. వాళ్ళ నిర్లక్షమే కారణమైతే సస్పెండ్/డిస్మిస్ చేయవచ్చు.
  5నిముషాల్లో అంతలా మంటలు ఎగిసాయంటే ఇది ఏ చిలకలూరిపేట బస్సు దహనం లాంటిదయివుంటుంది. ఏ మావోఇస్టులో, సైకో సాంబలో చేసుంటారు. వురి శిక్ష వేసినా మన మానవహక్కుల లాయర్లు రాష్ట్రపతి దాకా వెళ్ళి శిక్ష రద్దు చేయించుకొస్తారు.

  ReplyDelete
 5. మన భద్రతా ప్రమాణాలు ఇలా అఘోరించటానికి ఛార్జీలు పెంచకపోవటం అన్నిటికన్నా ముఖ్యమైన కారణం. పశువులను, కోళ్ళను తరలించినట్లుగా మన రైల్వేలు ప్రయాణీకుల్ని తరలిస్తారు. అసలు ఏ అభివృద్ది చెందిన దేశం లోనూ ఇలా మూడు బెర్తుల విధానం లేదు. వీటివల్ల అత్యవసర పరిస్తితి లో ప్రయాణికులు కనీసం బెర్తుల్లోంచి బయటపడే అవకాశం కూడా సరిగా ఉండదు. కాని జనాలు అసలు దీని గురించే పట్టించుకోరు. నేను (తప్పని పరిస్థితిలో) ఎప్పుడన్నా ప్రయాణించేటప్పుడు తోటి ప్రయాణికులతో దీని గురించి చెప్తే ఎగాదిగా చూస్తారు. వాళ్ళ నోటినించి వచ్చే సర్వసాధారణ సమాధానం "మన దేశం లో ఇయన్ని కుదరవండి".. మన దౌర్భాగ్యం ఏంటంటే ఉన్నది తీసెయ్యక పోగా ఆ మధ్య లాలు గారి బుర్రలో వెలిగిన మహత్తర ఐడియా సైడ్ న కూడా మూడు బెర్తులు..

  పిచ్చిక గూళ్ళ లాంటి ఏమర్జెన్సీ విండో పేరుకే తప్ప అత్యవసర సమయం లో ఎందుకు ఉపయోగపడదు.

  అతిపెద్ద ప్యాసింజర్ విమానమైన Airbus A380 లో 873 మంది ప్రయాణికులు అత్యవసర సమయం లో బయటపడటానికి పట్టే సమయం 90 సెకన్లు. మనదేశం లో 72 మంది 4 నిమిషాల్లో బయటపడలేని పరిస్థితి.

  ఒక్కో భోగీ కి కనీసం 6 ద్వారాలు (మధ్యలో 2) ఉండాలి. ఒక్కో డోర్ ఇప్పుడున్న దానికన్నా కనీసం ఒకటిన్నర రెట్లు వెడల్పు ఉండాలి. ఇంక ఆ ఇనుప డోర్లకు మధ్యలో గ్లాస్ ఫ్రేం ఏర్పాటు చెయ్యాలి. మూడు బెర్తుల విధానాన్ని తొలగించాలి. ఆ ఆదాయాన్ని మిగిలిన ప్రయాణికుల ద్వారా సంపాదించాలి. ఉన్న కిటికీల వైశాల్యం కూడా పెంచాలి. ఇవి కాక ఇంకా టెక్నికల్ గా అనేక మార్పులు చెయ్యవచ్చు. esp. electric system.. కాని పైన చెప్పినవి ప్రాధమికమైనవి. కేవలం ప్రమాదాల సమయంలోనే కాకుండా ప్రయాణీకుల సౌకర్యవంతమైన ప్రయాణానికి అతి ముఖ్యమైనవి.

  ReplyDelete
  Replies
  1. నిజమే... ఎలెక్ట్రికల్ పానెల్ డోర్ దగ్గర పెట్టడం సరైన డిజైనేనా? ఇది ఎప్పటి డిజైన్? ఇంటెగ్రల్ కోచ్ ఫేక్టరీలో, కోచ్ డిజైన్ మోడిఫికేషన్స్ ఏమైనా చేస్తోందా? లేదా ఎవరు చేస్తున్నారు? DRDO వాళ్ళకెలా పనీపాట లేక లాబ్ చెట్లకింద చిట్లు, చిల్లర యాపారాలు చేసుకుంటూ కాలం గడిపేస్తున్నారు. వాళ్ళకి ఇలాంటి డిజైన్ మోడిఫికేషన్ పని అప్పగించాలి.

   Delete
 6. ప్రమాదం ఒక్క సారి జరిగి, అది అంతకుముందెన్నడూ జరగనిదైతే తప్పు ఎవ్వరిదీ కాదు. మన దురదృష్టం. అందరికీ కాస్త పరిచయమున్నదైనా అరుదుగా జరిగే ప్రమాదం, జరిగితే అది కచ్చితంగా సిబ్బంది తప్పు. కానీ ఒకే ప్రమాదం, మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటే, అది వ్యవస్థ తప్పు, సంబంధిత పెద్ద తలకాయలది తప్పు. అందులో సిబ్బంది తప్పు ఉన్నా, అది నామమాత్రమే..! "ఆమ్ ఆద్మీ" అని కబుర్లు చెప్పుకుని రైల్వేని ఇష్టం వచ్చినట్టుగా నడిపిన రైల్వే మంత్రులందరినీ లోపలేసెయ్యాల్సిందే..! లాలూ , మమత, ముకుల్ రాయ్, సహాయ మంత్రులు అందరూ ఊచలు లెక్కపెట్టాల్సిందే..!

  ప్రమాదం జరిగితే, అక్కణ్ణుంచి గరిష్టంగా 2.5 ని.లలో తప్పించుకొనేలా కంపార్టుమెంట్ రూపకల్పన ఉండాలి. ఇది కనీస నియమం. ఇది జరగాలంటే, ముందు సత్యగారు అన్నట్టు గుమ్మం వెడల్పు పెంచాలి, మరో రెండు/నాలుగు గుమ్మాలు మధ్యలో పెట్టాలి. అలాగే, బెర్త్ నుండి గుమ్మానికొచ్చే దారి వెడల్పు పెంచాలి. అందుకు అక్కర ఉంటే, సైడ్ బెర్తులన్నీ ఎత్తేయాల్సిందే..!

  ఇన్ని రైళ్ళు వాటిలో ఇరుకు ఇరుగ్గా ప్రయాణిస్తున్నా, టికెట్లు దొరక ఇబ్బంది పడుతున్నవారు లక్షల్లో ఉన్నారు. అందుకున్న దారి, రైళ్లు సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెంచడం. అలా పెంచితే, ఇప్పుడున్న ట్రాకులు అంత దారొత్తిడి (ట్రాఫిక్)ని భరించలేవు. దానికి సింగిల్ లైన్, డబుల్ లైను కాకుండా కనీసం నాలుగు లైన్ల దారులన్నా ఉండాలి, ప్రధానమైన దారులు ఢిల్లీ-ముంబయి, ఢిల్లీ-వరంగల్-చెన్నై, ఢిల్లీ-కోల్ కత వంటి అత్యంత రద్దీ దారుల్లోనైతే ఆరు లైన్లైనా కావాలి. ఇవన్నీ కావాలంటే, ఛార్జీలు ముమ్మాటికీ పెంచాల్సిందే..!

  అంతేగానీ, "టిటియీలని అదుపులోకి తీసుకున్నాం, నెలరోజుల్లో నివేదిక అందజేస్తాం" లాంటి మభ్యపెట్టే ప్రకటనల వల్ల ఏమీ ఉపయోగం లేదు.

  ReplyDelete
 7. మంత్రులు, అధికారులు సడన్‌గా మారిపోయి - తమ భాధ్యతలను సరిగ్గా నిర్వర్తిస్తే, ఇటువంటి ధుర్ఘటనలు గణనీయంగా తగ్గుతాయంటారా? ఏందుకో ఈ అనుమానం కలిగింది.

  ReplyDelete