Friday, July 27, 2012

నార్వే దేశంలోని మంచుగడ్డలలో దివ్యమైన వాటర్ ఫాల్స్....ఫోటోలు

నార్వే దేశంలోని స్వాల్బార్డ్ అనే ప్రదేశం ఆర్కెటిక్ నార్త్ పోల్ మరియూ నార్వే దేశానికీ మధ్యలో ఉన్నది. 62,050 చదురపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఈ ప్రదేశం లోని 60 శాతం మంచు దిబ్బలతో నిండి వుంటుంది. ఇది అనేక ద్వీపాల సమూహం. గల్ఫ్ ప్రవాహంలో ఏర్పడిన వెచ్చదనం వలన ఈ ప్రదేశమంతా మంచుదిబ్బలతో నిండియున్నా వెచ్చదనం కలిగి ఉండటంవలన ఇక్కడ రకరకాల పక్షులూ, సముద్ర జీవులు ఉంటాయి. అక్కడ ఏర్పడుతున్న వాతావరణ వెచ్చదనం వలన మంచుదిబ్బలు కరిగి దాని నుండి వెళువడుతున్న నీరు చిన్న చిన్న వాటర్ ఫాల్స్ గా ఏర్పడటం ఈ ప్రదేశానికి అందం చేకూరుస్తోంది.


No comments:

Post a Comment