Thursday, July 5, 2012

తెలుసుకోలేని రహస్యాలు......ఫోటోలు

అన్ని తెలిసినవారు ఎవరూ ఉండరు. నిజంగా చెప్పాలంటే మనల్ని తెలుసుకోనివ్వరు. ప్రభుత్వాలు ఈ విషయంలో ఖచ్చితంగా ఉంటాయి. దీని కోసం ఎన్నో రహస్య గోప్యతా చట్టాలను మన ముందు ఉంచుతాయి. ప్రపంచంలోని అన్ని దేశాలూ ఈ విషయంలో ఒకేలాగా వ్యవహరిస్తాయి. కానీ ప్రతి విషయాన్ని తెలుసుకోవలసిన హాక్కు ప్రజలకు ఉన్నది. అయినా కొన్ని రహస్యాలను మాత్రం ప్రభుత్వాలు బయటపెట్టవు. మనం తెలుసుకోలేని కొన్ని రహస్యాలు.

వ్యాపార రహస్యాలు... ఉదాహరణకు ఇందులో ముఖ్యమైనది కోకో కోలా. ఈ రోజు వరకూ ఎవరూ కోకో కోలా ఫార్ములా రహస్యాన్ని తెలుసుకోలేక పోయేరు.


చమురు నిర్ధిష్ట స్థానాలు......చమురు ఎంత ముఖ్యమైనదో అందరికీ తెలుసు. కానీ భూమండలంలో చమురు దొరికే నిర్ధిష్ట స్థానాలను రహస్యంగా ఉంచేరు.

సమాచారం.......గూఢచర్య నిఘాలలో ప్రభుత్వాలకు ఎన్నో విషయాలు/సమాచారాలూ తెలుస్తాయి. కానీ ఈ విషయాలను ప్రజలకు తెలియనివ్వరు.

లాభ నష్టాల ప్రచురణ....ఇది చాలా ముఖ్యమైన, ప్రజలు తెలుసుకోవలసిన విషయం. కానీ ప్రభుత్వ లావాదేవీలలో ఏర్పడుతున్న లాభ నష్టాలను తెలియనివ్వరు. కానీ దీనిని వాడుకుని పలుకుబడి కలిగిన వ్యక్తులు డబ్బు పోగుచేసుకున్నారు.

బ్యాంక్ వివరాలు..... ఒకరి బ్యాంక్ వ్యవహారాల వివరాలను ఇంకొకరు తెలుసుకోకూడదనే చట్టం వలన ప్రభుత్వాలు ఎంత నష్టపోతున్నాయో ప్రభుత్వాలకు తెలుసు. అయినా ఈ విషయంలో ఎటువంటి చట్ట సవరణలు తీసుకురారు.

వైద్యసంబంధ రహస్యాలు......దీనివలన ఎంతోమంది నష్టపోతున్నారు. అయినా ప్రభుత్వాలు ఎటువంటి చర్యా తీసుకోరు.

న్యూక్లియర్ ఆయుధ రహస్యాలు.....పరిశోధనలలో దేశ ప్రజలకు ఎటువంటి నష్టం జరుగుతోందనే విషయం.

న్యాయస్థాన రహస్యాలు......కేసుల వాదోపవాదనల వివరాలు.

1 comment: