Wednesday, July 18, 2012

15 సంవత్సరాలుగా "మేయర్" పదవిలో ఉంటున్న పిల్లి...కారణం ఏమై ఉంటుంది?......ఫోటోలు

అలస్కా నగరంలోని టల్కీట్నా టౌనుకు స్టబ్స్ అనే పిల్లి 15 సంవత్సరాలుగా మేయర్ గా ఉంటోందట. ఆశ్చర్యంగా ఉన్నది కదూ. నిజమే. పిల్లి మేయర్ గా ఉండటం ఏమిటి?...ఒక పిల్లి మేయర్ గా పనిచేయగలదా?...ఎటువంటి పనులు చేపట్టగలదు? అనే ప్రశ్నలు అందరికీ వస్తాయి. ఇలాంటి ప్రశ్నలు ఆ టౌన్ ప్రజలకూ వచ్చి వుంటుంది. కానీ, అక్కడి ప్రజలు నాయకులకు పాఠం చెప్పటానికే అలాచేసేరు. 15 సంవత్సరాల క్రితం అంటే 1977 లో మేయర్ పదవికి పోటీ చేసిన వారు ఎవరూ ఆ పదవికి పనికిరారని తెలుసుకున్న అక్కడి ప్రజలు ఒక పిల్లిని ఆ పదవికి పోటీగా నిలబెట్టేరు. అంతే, ఆ పిల్లి అత్యంత మెజారిటీ తో గెలిచింది. అప్పటి నుండి ఆ పిల్లినే మేయరుగా ఎంచుకున్నారు. టౌను కు కావలసిన పనులను ప్రజలే చేసుకున్నారు, చేసుకుంటున్నారట. ఇది నాయకులకు ఒక గుణపాఠం అని అంటున్నారు. అక్కడున్న ఒక జెనరల్ స్టోర్స్ లో ఈ పిల్లి ఉంటుంది. తనను గెలిపించిన ఓటర్లను పిల్లి ఆ షాపులోనే కలుసుకుంటుంది.


No comments:

Post a Comment