Tuesday, July 31, 2012

క్రింద నుండి పైకి పయణించే మెరుపులను ఎప్పుడైనా చూసేరా? బహుశ చూసుండరు...ఈ వీడియోలో చూడండి.

మెరుపు ఒక వాతావరణంలోని విద్యుత్తు ప్రవాహం మూలంగా ఏర్పడే దృగ్విషయం. విద్యుత్తు ఉన్నదని నిరూపించేది. ఇవి ఎక్కువగా ఉరుములతో కూడిన వర్షం పడే సమయంలో కనిపిస్తాయి. మెరుపులు అత్యంతవేగంగా ప్రయాణిస్తాయి. ఇవి 60,000 మీటర్లు/సెకండు వేగంతో ప్రయాణించి, తాకిన ప్రాంతంలో ఇంచుమించు 30,000 °సెల్సియస్ ఉష్ణాన్ని పుట్టిస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 16 మిలియన్లకు పైగా మెరుపులు భూమిని తాకుతాయని అంచనా.

ఉరుములు, మెరుపులు అందరికీ తెలిసినవే. కానీ, మెరుపులు రకరకాల రంగుల్లో ఉంటాయని కొందరికే తెలిసుంటుంది. వాతావరణంలోని విశేషాలను బట్టి, గాలిని బట్టి మెరుపుల రంగు మారుతుంది. మేఘాలు, వర్షం ఉండగా మెరిసే మెరుపు ఎరుపు రంగులో ఉంటుంది. వడగళ్ల వానలో మెరుపు నీలం రంగులో ఉంటుంది. గాలిలో దుమ్ము ఎక్కువగా ఉంటే మెరుపు పసుపురంగులో వస్తుంది. ఇక ఏ రంగూ లేదో.. అన్ని రంగులూ కలిసిన తెల్లని మెరుపు ఉంటుంది. తెల్లని మెరుపు వచ్చిందంటే, వాతావరణంలో తేమ బాగా తక్కువగా ఉందని అర్థం. ఇలాంటి మెరుపు వల్ల మంటలు రేగుతాయి.

మెరుపులు ఏ రంగులో ఉన్నా, ఏటువంటి వాతావరణంలో వెలువడినా దాని ప్రయాణం పై నుండి క్రిందకే ఉంటుంది. ఇది మనమందరమూ గ్రహించే ఉంటాము. కానీ మెరుపులు క్రింద నుండి పైకి కూడా ప్రయాణిస్తాయని శాస్త్రవేత్తలు తెలుసుకున్నప్పుడు మొదటిసారిగా ప్రపంచం ఆశ్చర్యపోయింది...........ఈ క్రింది వీడియోలో క్రింద నుండి పైకి పయణించే మెరుపులను చూడండి.

కేరళా బ్యాక్ వాటర్స్ అందాలు...ఫోటోలు

ఏ కాలమైనా సరే మనసును ఆహ్లాదపరిచే పచ్చదనంతో పర్యాటకుల కు స్వాగతం పలుకుతుంది కేరళ .చుట్టూ నీరు, తీరంగుండా అలరిం చే కొబ్బరి చెట్లు కెరళకు సింబాలిక్‌గా మారాయి. అరేబియా సము ద్రానికి సమాంతరంగా సాగే బ్యాక్‌వాటర్ లాగూన్స్ పర్యాటకులను అలరించడం ఖాయం. నాటు పడవ నుంచి పెద్ద క్రూజర్ వరకు ఆ మాటకొస్తే దేనిపెై ప్రయాణించినా సరే కేరళా అందం హృదయాన్ని మీటకుండా ఉండదు. జాలీగా కేరళకు వెళ్దాం అనుకునే వారు కుట్ట నాద్ బ్యాక్‌వాటర్స్, కొచ్చిన్ బ్యాక్ వాటర్స్, కొల్లమ్ బ్యాక్ వాటర్స్, కుమరకోమ్ బ్యాక వాటర్స్‌ను సందర్శించకుండా ఉండరు.


హృదయం ఆకారంలో భూమిమీదున్న అందమైన ఉపరితలాలు....ఫోటోలు

చెరువులూ, పసరిక పొలాలూ, దీవులూ మరియూ సమతల ముద్రణ ఇవన్నీ పైనుండి చూస్తే అపక్రమ రూపాలలో కనబడతాయి. కానీ కొన్ని మాత్రం ఆశక్తి కలిగించే రూపాలలో ఉంటాయి. అలాంటి రూపాలలో హ్రుదయం ఆకారంలో (ప్రక్రుతిగాగానీ లేక మానవులచే రూపొందించబడినదిగాగానీ) ఉన్నవి మాత్రం టూరిస్టుల మధ్య,ముఖ్యంగా ఫోటోగ్రాఫర్ల మధ్య ఆదరణ పొందినై. వాటి గురించి తెలుసుకుందాం.

Heart-Shaped Mangrove, New Caledonia

Heart Reef, Australia

Isla Corazón, Ecuador

Heart-Shaped Meadow, UK

Heart-Shaped Island, Brasil

Meadow in Trittau, Germany

Galešnjak, Croatia

Lake in the Amazon Jungle, Brasil

Lake McKenzie, Australia

ఒక సారి రైల్వే మంత్రులనూ, అధికారులను శిక్చించండి...రైలు ప్రమాదాలు ఖచ్చితంగా తగ్గిపోతాయి


రైలు ప్రమాదం జరిగినప్పుడల్లా ప్రయాణీకుల బద్రతను కాపాడవలసిన రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే అధికారులూ ప్రమాదానికి డొంక తిరుగుడు కారణాలు వెతికి మరీ చెబుతారు. కారణాలు ఏవైన ఆ కారణాలు చోటుచేసుకోవడానికి కారణకర్తలు వారేనని ఒప్పుకోరు. నిన్న నెల్లూరు దగ్గర జరిగిన తమిళనాడు ఎక్స్ ప్రెస్స్ S11 కోచ్ ప్రమాదానికి భాద్యత నాదికాదనీ కాబట్టి నేను రాజీనామా చేయవలసిన ప్రశ్నకు తావేలేదని రైల్వే మంత్రి ముకుల్ రాయ్ తెలిపేరు. నిజమే ఎంతో కష్టపడి, మమతా బెనర్జీ ప్రధానమంత్రితో గొడవపడి, బెదిరించి ఈయనకు ఆ పదవి ఇప్పిస్తే అప్పుడే ఆ పదవి వదులుకుంటే ఎలా?....ఇదండీ మన భారత రైల్వే మంత్రిత్వ శాఖ పనిజరుపుతున్న విధానం.

భారతీయ రైళ్ళు మృత్యు శకటాలుగా మారాయి. ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ ఉన్న భారతీయ రైల్వేలలో భద్రత శుష్క వాగ్దానంగా, కంటి తుడుపు మాటగా మాత్రమే మిగిలిపోవడం విచారకరం. ప్రయాణీకుల భద్రత కోసం ప్రతి బడ్జెట్లో వేల కోట్ల రూపాయలు కేటాయించినదంతా ఏమైపోతోంది. అత్యాధునిక రక్షణ వ్యవస్థలను ప్రవేశపెట్టడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు? రైలు ప్రమాదాల్లో 42 శాతం(ఈ శాతం ఇప్పటికీ ఇంకా ఎక్కువగా పెరిగే ఉంటుంది) రైల్వే సిబ్బంది వైఫల్యం వల్లనే సంభవిస్తున్నాయని అనిల్ కకోద్కర్ కమిటీ నిగ్గు తేల్చింది. అయితే ప్రమాదం సంభవించిన ప్రతిసారీ విద్రోహ చర్యగా రైల్వే అధికారులు ప్రకటిస్తుంటారు. షార్ట్ సర్క్యూట్ వంటి ప్రమాదాలు జరిగినా పసిగట్టగలిగే ఫైర్ డిటెక్షన్ విధానాన్ని అమలు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదన ఇప్పటికీ కాగితాలకే పరిమితమైంది. 2009 మార్చి-సెప్టెంబర్ మధ్యకాలంలో 14 రైళ్ళలో జరిగిన అగ్ని ప్రమాదాల్లో ఆరు ఎలక్ట్రికల్ షాట్ సర్క్యూట్స్ వల్లే జరిగాయని తేలింది.


ఏడాది వ్యవధిలో ఈ తరహా దుర్ఘటన జరగడం ఇది నాలుగోసారి. ఇంతక్రితం గత ఏడాది ఏప్రిల్‌లో మధ్యప్రదేశ్‌లో ముంబై-ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లోని మూడు బోగీలు తగలబడ్డాయి. అదే ఏడాది జూలైలో న్యూఢిల్లీ-పాట్నా రాజధాని ఎక్స్‌ప్రెస్ జనరేటర్ కోచ్ ఢిల్లీ దగ్గర్లో తగలబడింది. ఈ రెండు ప్రమాదాల్లోనూ అదృష్టవశాత్తూ ప్రాణనష్టం జరగలేదు. ఆ తర్వాత నవంబర్‌లో హౌరా-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌కు మంటలంటుకుని ఏడుగురు సజీవదహనమయ్యారు. ప్రతి దుర్ఘటనా మాకు గుణపాఠమేనని ఓసారి అప్పటి రైల్వే శాఖ సహాయ మంత్రి దినేశ్ త్రివేదీ వాక్రుచ్చారు. ఇకపై ఇలాంటివి పునరావృతం కానీయబోమని కూడా ఆయనన్నారు. ఆయనే కాదు... రైల్వే శాఖను చూసే ప్రతి మంత్రి నోటా ఇలాంటి ఆణిముత్యాలు వెలువడుతూనే ఉంటాయి. ఎలాంటి అగ్ని ప్రమాదాలనైనా తట్టుకునేలా, మంటలు విస్తరించకుండా ఉండేలా కోచ్‌లను నిర్మిస్తామని, షార్ట్ సర్క్యూట్లాంటిది సంభవించకుండా బహుళ అంచెల విద్యుత్ రక్షణ వ్యవస్థను అమరుస్తామని చాన్నాళ్లక్రితం బడ్జెట్ ప్రసంగంలో కూడా చెప్పారు. ఇవన్నీ అమలై ఉంటే తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో ఈ విషాదం సంభవించేదికాదు.

తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో లోని S11 కోచ్ ప్రయాణానికి పనికిరాదని 3 నెలల క్రిందే గుర్తించేరట. ఈ కోచ్ లో ఎలెక్ట్రికల్ ప్రాబ్లం ఉన్నదని తెలిపేరట. దానికి మరమత్తులు చేసి ప్రయాణాలకు ఉపయోగించేరట. ఈ సంవత్సరం మే నెల మళ్ళీ ఈ కోచ్ మరమత్తులకు వెళ్ళింది. మళ్ళి మరమత్తులు చేసి వాడుకున్నారు. 2 లేక 3 సార్లు ఒకే ప్రాబ్లం తో మరమత్తులకు వెళ్ళిన కోచ్ ను డిస్ మాంటల్ చేయకుండా ఏవో మరమత్తులు చేసి వాడటం ఈ రోజు అది 50 మంది ప్రాణాలు తీయడమే కాకుండా ఆ కోచ్ లో ప్రయాణం చేసిన అందరికీ భాదలనే మిగిల్చింది.

దీనికి ఎవరు కారణం? రైల్వే మంత్రిత్వ శాఖ మరియూ సంబంధించిన రైల్వే అధికారులూ.....కాబట్టి ఈ 50 మంది సజీవదహనానికి రైల్వే మంత్రి, మంత్రిత్వ శాఖ మరియూ సంభందిత రైల్వే అధికారులే కారణం... వారిని శిక్చించండి...జైళ్లకు పంపండి

Monday, July 30, 2012

లండన్ 2012 ఒలింపిక్స్ ఓపనింగ్ సెర్మొనీలో మిస్టర్.బీన్(Mr.Bean)....వీడియో


పూర్తి వీడియో చూడండి


Mr. Bean - Jeux Olympiques Londres 2012 by Spi0n

తల్లి ప్రేమ-రాయబడని ప్రక్రుతి చట్టం.....ఫోటోలు


ప్రపంచవ్యాప్తంగా ప్రశిద్ది చెందిన విగ్రహాలు....ఫోటోలు

ఈస్టర్ ద్వీపంలో ఉన్న రాతి విగ్రహాలు

రియో డీ జనెరో లో ఉన్న ఏసు ప్రభువు విగ్రహం

చైనాదేశంలోని లెస్ హాన్ లో ఉన్న బుద్దుని విగ్రహం

గిజాలో ఉన్న స్పీనిక్స్ విగ్రహం

వాషింగ్ టన్ లోని లింకన్ మెమోరియల్ లో కూర్చిని ఉన్న ఆబ్రహం లింకన్ విగ్రహం

లండన్‌లో ఉన్న అడ్మైరల్ హోరొషియో నెల్సన్ విగ్రహం

జపాన్‌లోని కమకూరా ప్రదేశంలో ఉన్న కంచు బుద్ద విగ్రహం

నేపాల్ దేశంలో ఉన్న అతిపెద్ద శివుని కంచు విగ్రహం
మాస్కో లోని పీటర్ ది గ్రేట్ విగ్రహం
చైనాలోని లూషా నగరంలోని 128 మీటర్ల ఎత్తున్న బుద్ద విగ్రహం

న్యూయార్క్ లోని లిబర్టీ విగ్రహం

మంగోలియాలో ఉన్న చెంగీస్ ఖాన్ విగ్రహం

రోం నగరంలోని మార్కస్ ఔరులియస్ కంచు విగ్రహం