Wednesday, June 6, 2012

స్ట్రా బెరీ మిల్క్ షేక్ (Strawberry Milkshake) లాగా ఉన్న సరస్సు....ఫోటోలు

పడమటి ఆఫ్రికా లో ఉన్న సెనెగల్ దేశంలో ఉన్న ఈ సరస్సును లేక్ రెట్బా(Lake Retba ) లేక లాక్ రోస్(Lac Rose) అంటారు. రోజులోని సమయాన్ని బట్టి ఈ సరస్సులోని నీరు పర్పుల్ రంగు నుండి చిక్కటి పింక్ కలర్ గా మారుతుంది. ఈ సరస్సులోని నీటి యొక్క అసాధారణమైన రంగుకు కారణం ఆ నీటిలో ఉన్న హాని చేయనటువంటి హాలో ఫిలిక్ బాక్టీరియా క్రిములే కారణం. అధికమైన ఉప్పును ఇష్టపడే ఈ బాక్టీరియా పేరు దునాలియల్లా సలీనా. ఈ సరస్సు యొక్క నీటిలో ఉప్పు చాలా అధికముగా ఉంటుంది. 1970 నుండి ఇక్కడ నివసిస్తున్న ప్రజలు ఈ సరస్సులోనుండి ఉప్పు తీయడం మొదలుపెట్టేరు.


No comments:

Post a Comment