Saturday, June 9, 2012

కుక్కను సాక్ష్యానికి పిలిచిన ముద్దాయి....ఫోటోలు మరియూ వీడియో

ఫ్లోరీడాకు చెందిన రోడ్నీ మెక్ గీ అనే అతను డ్రైవింగ్ నేరం క్రింద కోర్టులో హాజరయ్యేడు. అతని కేసు జడ్జ్ ముందు వచ్చినప్పుడు పోలీసులెవరూ హాజరు కానందున తాను తప్పుచేయలేదని...అది నిరూపించడానికి పోలీస్ ఆఫీసర్ అజార్ K9 ను కోర్టుకు పిలిపించవలసినదిగా జడ్జ్ ను కోరేడు. జడ్జ్ అతని అభ్యర్ధనను ఒప్పుకుని పోలీస్ ఆఫీసర్ అజార్ K9 కోర్టులో హాజరు కావాలని, సాక్ష్యం చెప్పాలని ఆదేసించేరు.


కోర్టులో హాజరైన పోలీస్ ఆఫీసర్ అజార్ K9 ను చూసి జడ్జ్ తో పాటూ, ముద్దాయి మరియూ కొర్టులో హాజరైన వారు ఆశ్చర్యపోయేరు. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్ అజార్ K9 ఒక పోలీస్ కుక్క.


ముద్దాయి చేసిన నేరమేమిటంటే టర్నింగ్ సిగ్నల్ వేయకుండా కారును వేగంగా తిప్పేరు. అనుమానం వచ్చిన పోలీసులు, అతని కారును ఆపి పోలీస్ కుక్కతో అతని కారులో మత్తు మందులు(డ్రగ్స్) ఉన్నాయేమోనని వెతికించేరు. అలాంటివేమీ దొరకలేదు. కానీ అతన్ని కారు తిరిగే సిగ్నల్ వేయకుండా కారును తిప్పేడని కేసు రాసి కోర్టులో హాజరు అవాలని తెలిపేరు.


తన కారులో డ్రగ్స్ లేవని, కావలనే పోలీసులు సిగ్నల్ వేయలేదని కేసు రాసేరని ముద్దాయి కోర్టుకు తెలుపుతూ, అసలు ఆ కుక్క డ్రగ్స్ ఉన్నాయో లేదో కనుక్కోగలదా అని పరీక్ష చేయాలని, కాబట్టి కోర్టుకు తాను మరిజూనా డ్రగ్ తెస్తాను ఆ కుక్క కనుక్కుంటుందా లేదా అని తెలుసుకోవచ్చునని కోర్టును అభ్యర్ధించేడు. తన కోర్టులో అలాంటి పరీక్షలు జరపటానికి వీలులేదని, ముద్దాయి అభ్యర్ధనను తిరస్కరిస్తూ, అతను టర్నింగ్ సిగ్నల్ వేయనందుకు గానూ అతనికి 300 డాలర్లు(సుమారు రూ.15,000/-) జరిమానా వేసేరు జడ్జ్.

ఫోటో క్రెడిట్: వింక్ న్యూస్ మరియూ డైలీ మైల్

No comments:

Post a Comment